365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 30,2024: సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ 2024 ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, పొంగులేటి, నామా, కొండ సురేఖ, ముఖ్య కార్యదర్శి ,విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫలితాల విడుదల: 56 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషమని సీఎం తెలిపారు. ఇది విద్యార్థులకు సులభంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.
పోస్టుల సంఖ్య: మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలు 2,46,584 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
నియామక ప్రక్రియ: దసరా పండగకు ముందుగా ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేయాలని సీఎం మంత్రులకు సూచించారు. “సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ను కూడా పూర్తి చేస్తాం” అని చెప్పారు.
నియామక పత్రాలు: అక్టోబర్ 9న ఎల్డీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేస్తామని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా, విద్యా రంగంలో యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, మంచి ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను నియమించడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి తెలిపారు.
డీఎస్సీ ఫలితాలు తెలంగాణలో విద్యా రంగానికి ఒక కీలక దశగా భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య పెరుగనుంది.