365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జులై 17, 2024 :లండన్ కి చెందిన టెక్నాలజీ కంపెనీ నథింగ్ ఉప-బ్రాండ్, అంతర్జాతీయంగా కూడా అనూహ్యమైన డిమాండ్ ని అనుసరించి CMFసేల్స్ ఫ్లిప్ కార్ట్ పై ఉత్తేజభరితమైన ఆఫర్ తో భారత కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్లీ ప్రారంభమవుతా యని నథింగ్ ఈ రోజు ప్రకటించింది.

సేల్స్ మొదటి రోజు శుక్రవారం జులై 12న కంపెనీ కేవలం 3 గంటల్లో CMF ఫోన్ 1ను 100,000 యూనిట్స్ విక్రయించి ప్రభావితపరిచే మైలురాయికి చేరుకుంది.

శ్రేణిలోనే మార్గదర్శకత్వంవహించే పనితీరును CMF ఫోన్ 1 అందిస్తుంది. మీడియా టెక్ డైమన్సిటి 7300 5జీ ప్రాసెసర్, వేగం, నమ్మకం,సామర్థ్యం కోసం నథింగ్ తో సహ-ఇంజనీర్డ్ చేయబడిన భారతదేశంలోని మొదటి ఫోన్. 5000 mAh బ్యాటరీతో, యూజర్స్ సింగిల్ ఛార్జీపై రెండు రోజుల వరకు ఆనందించవచ్చు.

16 GB RAM వరకు, ఇది సాఫీగా బహుళ పనులను నిర్థారిస్తుంది. నథింగ్ OS 2.6 పై పని చేస్తుంది, ఆండ్రాయిడ్ 14తో మద్దతు చేయబడిన ఈ ఫోన్ విలక్షణమైన, కస్టమైజబుల్ ఆండ్రాయిడ్ అనుభవం అందిస్తుంది.

శక్తివంతమైన కెమేరా వ్యవస్థలో సోనీ 50 MP కెమేరా ఖచ్చితమైన బొకెహ్ ప్రభావాలు కోసం ప్రత్యేకమైన పోర్ట్ రైట్ సెన్సర్ ను,16 ఎంపి ఫ్రంట్ కెమేరాను కలిగి ఉంది. మెరిసే 6.67” సూపర్ AMOLED డిస్ ప్లే నిరంతర ప్రతిచర్యలు కోసం అత్యంత సాఫీ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేటును ప్రదర్శిస్తుంది.

ఇది వివిధ రంగులు, మెటీరియల్స్,ఫినిషెస్ మార్చగలిగే కవర్స్ ద్వారా తమ వ్యక్తిగత వ్యక్తిత్వాలను వ్యక్తీకరించడానికి యూజర్స్ కు అనుమతినిచ్చే వినూత్నమైన మాడ్యులార్ డిజైన్ ను కలిగి ఉంది.

CMF ఫోన్ 1 లానియార్డ్, కార్డ్ హోల్డర్, స్టాండ్ సహా ప్రత్యేకమైన జోడించదగిన యాక్ససరీస్ ద్వారా తమ డివైజ్ మరింత సమర్థవంతంగా పని చేయడానికి కూడా ప్రజలకు అవకాశం ఇస్తుంది.

ధర,లభ్యత
CMF ఫోన్ 1 రెండు మోడల్స్ లో లభిస్తోంది:

  • 6GB + 128GB – ₹15,999
  • 8GB + 128GB – ₹17,999
    పరిమితమైన సమయం ఆఫర్: కస్టమర్స్ బ్యాంక్ ఆఫర్స్ పొందగలరు,CMF ఫోన్ 6 6GB + 128GB వేరియెంట్ ను రూ. 14,999కి,8GB + 128GB వేరియెంట్ ను రూ.16,999కి ఈ రోజు కొనుగోలు చేయవచ్చు.
  • అదనపు ఆఫర్: ఫ్లిప్ కార్ట్ పై CMF ఫోన్ 1ను కొనుగోలు చేసే వినియోగదారులు CMF వాచ్ ప్రో2 ,CMF బడ్స్ ప్రో 2 పై రూ.1000 డిస్కౌంట్ పొందుతారు.
  • CMF ఫోన్ 1 ఫ్లిప్ కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్, ఇతర భాగస్వాముల వద్ద లభిస్తోంది.

Also read : Canon Elevates Legacy with EOS R1 & EOS R5 Mark II: Unveils the Next Gen Innovations in Filmmaking & Photography

ఇదికూడా చదవండి:15వ మాన్‌సూన్‌ రెగట్టా లో అగ్రస్థానంలో గోవర్ధన్..

Also read :15th Monsoon Regatta the Telangana Sailors dominated the under 16 Optimist fleet with Govardhan Pallara

Also read : Encalm Hospitality Expands into accommodation services with Debut Transit Lounge at Rajiv Gandhi International Airport, Hyderabad.

Also read : NMDC hosts an interactive session on World PR Day..

ఇదికూడా చదవండి: పూజా ఖేద్కర్ తర్వాత మరొక ఫేక్ ఐఏఎస్ అధికారి..