365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 7,2023: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గ్రాండ్ విటారా లాంచ్‌తో మిడ్-సైజ్ SUV రంగంలోకి ప్రవేశించింది.
ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్, ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్, సుజుకి ఆల్‌గ్రిప్ సెలెక్ట్ మోడల్‌లతో మల్టీ-ప్రొడక్ట్ ఆఫర్ చేయడం వల్ల SUV కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఆ తర్వాత ఇప్పుడు మారుతి సుజుకి గ్రాండ్ విటారాను S-CNG టెక్నాలజీతో విడుదల చేసింది.
ఇంజిన్ పవర్ అండ్ మైలేజ్..
మారుతి సుజుకి గ్రాండ్ విటారా నెక్స్ట్-జెన్ K-సిరీస్ 1.5-లీటర్, డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌లను పొందుతుంది. గ్రాండ్ విటారా S-CNG (గ్రాండ్ విటారా S-CNG) SUV 5500 rpm వద్ద 64.6kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
CNG మోడ్‌లో 4200 rpm వద్ద గరిష్టంగా 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించిన గ్రాండ్ విటారా S-CNG 26.6 kmpl మైలేజీని కలిగి ఉంది.
మరిన్నిమోడల్స్..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా S-CNG లాంచ్‌ను ప్రకటిస్తూ, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “సెప్టెంబర్ 2022లో ప్రారంభించినప్పటి నుంచి, గ్రాండ్ విటారాకు భారతీయ వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
S-CNG ఎంపిక పరిచయం గ్రాండ్ విటారా ఆకర్షణను మరింత మెరుగుపరిచింది. గ్రాండ్ విటారా S-CNG మా గ్రీన్-పవర్‌ట్రెయిన్ ఆఫర్‌లకు అదనంగా ఉంటుంది. కొత్తగా మరో 14 మోడళ్లను మార్కెట్ లోకి తీసుకువస్తాం అని ఆయన తెలిపారు.”
గ్రాండ్ విటారా మల్టీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ , క్లాస్-లీడింగ్ ఫీచర్‌లతో వస్తుంది. ఉల్లాసమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కస్టమర్లకు 6-ఎయిర్‌బ్యాగ్ వేరియంట్‌ను అందించే ఏకైక ప్రీమియం CNG SUV ఇది.
గ్రాండ్ విటారా స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటో, 40+ కనెక్ట్ చేసిన ఫీచర్‌లతో ఇన్‌బిల్ట్ నెక్స్ట్-జెన్ సుజుకి కనెక్ట్ వంటి నెక్స్ట్-జెన్ టెక్నాలజీని అందిస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా S-CNG రెండు వేరియంట్లలో వస్తుంది. డెల్టా (MT),జీటా (MT). డెల్టా (MT) వేరియంట్ ధర రూ.12.85 లక్షలు కాగా, జీటా (MT) వేరియంట్ ధర రూ.14.84 లక్షలుగా ఉంది. (రెండు ఎక్స్-షోరూమ్
ధరలు).
గ్రాండ్ విటారా S-CNG SUV నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌పై కూడా అందుబాటులో ఉంది. గ్రాండ్ విటారా S-CNGని మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ద్వారా రూ. 30,723 నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలతో కొనుగోలు చేయవచ్చు.
మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ అనేది కొత్త కారును ఇంటికి తీసుకురావడానికి అనుకూలమైన మార్గం. దీని ద్వారా, కస్టమర్‌లు అన్నీ కలుపుకొని నెలవారీ చందా రుసుమును చెల్లించి కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. ఈ రుసుము పూర్తి రిజిస్ట్రేషన్, ,నిర్వహణ, బీమా, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఖర్చును కవర్ చేస్తుంది.