
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,ఫిబ్రవరి 24,2022: ఇండియాలో అతి పెద్ద క్రిప్టో ప్లాట్‌ఫాం కాయిన్ స్విచ్ ఇప్పుడు రికరింగ్ బయ్ ప్లాన్‌ను ప్రారంభించింది,ఇది ఇండియాలో క్రిప్టో అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు సులభమై న,ప్రణాళికపరమైన మార్గం. ఈ లాంఛ్‌తో, యూజర్లు మార్కెట్ ఒడిదుడుకులను ఎదిరించేందుకు,హఠాత్తుగా కొనుగోళ్లు లేదా అమ్మకాలు చేసే నిర్ణయాలను నివారించ డాన్ని కాయిన్‌స్విచ్ లక్ష్యంగా చేసుకుంది. “కాయిన్‌స్విచ్‌లో,యూజర్లకు వారి క్రిప్టో ప్రయాణంలో సహాయం చేయాలని భావిస్తున్నాము.
క్రిప్టో ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నా సరే,ఇది ఆకర్షణీయమైన అసెట్ క్లాస్, సంప్రదాయ పెట్టుబడి విధానాలతో పోల్చితే, దీనిలో అధికంగా ఒడిదుడుకులు ఉంటాయి. కాయిన్‌స్విచ్ రికరింగ్ బయ్ ప్లాన్ ద్వారా యూజర్లు క్రిప్టోను ప్రణాళికా బద్ధంగా కొనుగోలు చేయగలరు,మార్కెట్‌లో కొనుగోలు చేసే సమయంలో ప్రేరణ నుంచి, అలాగే భావోద్వేగ పూరిత ట్రేడింగ్ నిర్ణయాల నుంచి నివారిస్తుంది. మరింత వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణా బద్ధంగా కొత్త అసెట్ క్లాస్‌ను అన్వేషించడానికి ఇది సాధికారత అందిస్తుంది,” అని కాయిన్‌స్విచ్ ఫౌండర్,సీఈఓ,ఆశిష్ అగర్వాల్ తెలిపారు.రికరింగ్ బయ్ ప్లాన్ (ఆర్‌బీపీ) ద్వారా, యూజర్లు నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా, సుదీర్ఘ కాలంపాటు క్రిప్టో కొనుగోళ్ల కోసం ప్రతి నెలా పక్కన పక్కన పెట్టడంతో, మార్కెట్ సరళి, సమయంపై దృష్టి పెట్టేందుకు బదులుగా,దీర్ఘ కాల వ్యూహాన్ని అమలు పరిచేందుకు అవకాశం కల్పిస్తుంది.

కాయిన్‌స్విచ్‌లో, యూజర్లు తమ వెరిఫైడ్ బ్యాంక్ అకౌంట్‌ల ద్వారా భారతీయ రూపాయలను డిపాజిట్,చేయవచ్చు. ఈ కంపెనీ కేవలం నివాసిత భారతీయ బ్యాంక్ అకౌంట్‌లను మాత్రమే ఈ ప్లాట్‌ఫాంలో అనుమతిస్తుంది,స్క్రీనింగ్ (రాజకీయంగా ప్రభావితం చూపగల వ్యక్తి స్థితి, మంజూరు జాబితా, ప్రతికూల వార్తలను) చేస్తుంది, ఇంకా ఇతర కేవైసీ తనిఖీలను నిర్వహిస్తుంది.ఆర్‌బీపీ ని యూజర్లు 3 సులభమైన దశలలో చేయగలరు:
- కొనుగోలు పేజీలో ‘రికరింగ్ బయ్’ ను క్లిక్ చేసి, కావాల్సిన మొత్తాన్ని ఎంచుకోవడం.
- కోరుకున్న నెలవారీ తేదీని ఎంచుకోవడం.
- ఆర్డర్‌ను నిర్ధారించడం.
భవిష్యత్/పునరావృత ఆర్డర్ల కోసం యూజర్లు తమ కాయిన్‌స్విచ్ అకౌంట్‌లో తగినం బ్యాలెన్స్ ఉండేలా నిర్ధారించుకోవాలి. ఈ ప్లాట్‌ఫాంపై కొనుగోలు ఆర్డర్లకు గల గరిష్ట పరిమితి ₹2,50,000. ఒక్కో క్రిప్టోకు యూజర్లు ఒకటి లేక బహుళ ఆర్‌బీపీలను కలిగి ఉండవచ్చు.