
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పూణె, ఏప్రిల్ 2, 2022:విద్యుత్ వాహన తయారీదారు & సాంకేతిక సంస్థ,పిన్నకిల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన ఈకేఏ, ఈరోజు తన 9-మీటర్ల విద్యుత్ & సున్నా-ఉద్గారాల బస్సును ప్రవేశపెట్టింది. ఈకేఏ వారి మొట్టమొదటి బ్యాటరీ-విద్యుత్ బస్సు అయిన E9, తన మోనోకోక్ స్టెయిన్లెస్ స్టీల్ ఛాసిస్,సంపూర్ణ సమగ్ర నిర్మాణము కారణంగా కొత్తగా క్రమబద్ధీకరిం చబడిన వాహన ఆకృతి, గరిష్ఠ శక్తి & శ్రేణి కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న అంతర్దహన ఇంజన్ తో నడిచే బస్సుల కంటే తక్కువ మొత్తం యాజమాన్య ఖర్చు (టిసిఓ)తో, ఈకేఏ E9 వాటాదారులకు స్థిరత్వాన్ని ,లాభాన్ని అందించే వాగ్దానం చేస్తుంది.
మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, పర్యావరణ & ప్రోటోకాల్ మంత్రి గౌరవ ,ఆదిత్య థాకరే ,EKA & పినాకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ డా. సుధీర్ మెహతా చేతుల మీదుగా బస్సును ఆవిష్కరించారు. ఈ బస్సు మహారాష్ట్ర ప్రభుత్వము,మహారాష్ట్ర పారిశ్రామికా భివృద్ధి నిగమం (ఎంఐడిసి) మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపిసిబి) చే మరాఠా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ (ఎంసిసిఐఎ) తో కలిసి నిర్వహించబడే ది పూణె ఆల్టర్నేట్ ఫ్యూయల్ కాంక్లేవ్ (ఏఎఫ్సి) వద్ద ఆవిష్కరించబ డింది.
E9 ఆవిష్కరణతో, వినియోగదారులకు విశ్వసనీయమైన, లాభదాయకమైన పనితీరుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్ననగరాలలో సుస్థిరమైన,సమర్థవంతమైన ప్రజా రవాణా కొరకు ఒక వేదికను అందించుటకు ఈకేఏ కట్టుబడి ఉంది. వినియోగదా రులు విద్యుత్ వాహనాలను ఎంచుకునే దిశగా మారుతున్న తరుణంలో, ఈకేఏ వారి E9 విద్యుత్ బస్సు ప్రత్యేకంగా రూపొందించబడిన, అనుకూలపరచబడిన, ఉత్తమ తుప్పు-రహిత మన్నికను నిర్ధారించే ఆధునిక మోనోకోక్ స్టెయిన్లెస్ స్టీల్ ఛాసిస్, తక్కువ శబ్దము,ప్రకంపనలు, శుద్ధిచేయబడిన బస్ ఆకృతి,భద్రత, లాభదాయకత, సమర్థత, విశ్వసనీయత & పనితీరుకు ప్రాధాన్యతతో భారతదేశములో తయారుచేయ బడిన దేశీయ ఉత్పత్తి అందిస్తుంది.

ఈకేఏ E9 ఈసిఏఎస్ తో ముందువైపు,వెనుకవైపు ఎయిర్ సస్పెన్షన్ లను రెండిటితో వస్తుంది. 2500 ఎంఎం వెడల్పు, 31+D +వీల్ చెయిర్ (వీల్ చెయిర్ ర్యాంప్ ఉన్నది) ఉన్న ఈ బస్ ప్రయాణీకుల కదలికల కొరకు తగినంత చోటును అందిస్తుంది (కూర్చోవడం + నిలబడటం). తక్కువ ఎత్తులో ఉన్న ప్రవేశ/బయటికి మెట్లు సమర్థతాపరంగా రూపొందించబడ్డాయి. ఇవి 650 ఎంఎం అతి తక్కువ ఫ్లోర్ ఎత్తు ఉండటం వలన వృద్ధులకు, పిల్లలకు, మహిళలకు & ముఖ్యంగా దివ్యాంగులైన ప్రయాణీకులకు సౌకర్యాన్ని అందిస్తుంది & అందుబాటులో ఉంటుంది. డ్రైవర్ కాక్ పిట్ లో పెరిగిన సమర్థత, ఆటో-డ్రైవ్ విశేషత, టిల్టింగ్,టెలిస్కోపిక్ స్టీరింగ్ ,ఆల్ ఇన్ వన్ సెంట్రల్ కన్సోల్ మొదలైన విశేషతలు అన్నీ ప్రయాణీకులకు ,డ్రైవర్స్ కు సున్నితమైన స్వారీ అనుభవాన్ని ఇస్తాయి.
చాలా వరకు, సుందరంగా రూపొందించబడిన వాణిజ్య వాహనము అయిన ఈకేఏ E9లో స్మైలీ ఫ్రంట్ లేఅవుట్, స్టైల్ గా ఉండే వేవర్ సైడ్ ప్యానెల్,పానోరామిక్ వీక్షణల కొరకు పెద్ద అద్దాలు వంటి విశేషతలు ఉన్నాయి. ఇవి దీనికి మరింత స్వాగతించే & భవిష్యత్ ఆకర్షణను అందిస్తాయి. ఈకేఏ E9 గరిష్ఠంగా 200 KW శక్తి ,2500 NM టార్క్ ఉత్పన్నం చేసే ఒక విద్యుత్ మోటార్ ద్వారా ఆధారితమైనది, ఇవి దీనికి ఏ భూభాగములో అయినా నడవగలిగే శక్తి కొరకు 17% శ్రేణితతో వేగవంతమైన త్వరణం, మరింత హార్స్ పవర్, అధిక ట్రాక్షన్ శక్తి, పరిశ్రమ-ప్రముఖ విశ్వసనీయత ,పునరుత్పాదక బ్రేకింగ్ వ్యవస్థను అందిస్తాయి.
నగరాలలో పనిచేయుటకు తగిన శక్తివంతమైన Li-Ion బ్యాటరీతో, ఈ బ్యాటరీ వ్యవస్థ సురక్షితమైనది, మన్నిక గలది,సమర్థవంతమైనది. ఈకేఏ E9 లో ఏకీకృతం చేయబడిన వ్యూహముతో వాహనము విశేషతల కొరకు ఇన్-హౌస్ లో రూపొందించబ డిన వాహన నియంత్రణ యూనిట్ సాఫ్ట్ వేర్ కూడా కలిగి ఉంది.

తేలిక బరువు స్టెయిన్ లెస్ స్టీల్ మోనోకోక్ ఛాసిస్ ఉన్న ఈ బస్ అసాధారణ నిర్మాణాత్మక శక్తి & మన్నికను పెంచుతుంది, సంప్రదాయిక బస్సుల మాదిరి కాకుండా దీనిలోని కాంపోజిట్ ప్యానెల్స్ తుప్పు-రహితమైనవి. ఈకేఏ E9,ఉత్తమ శ్రేణి భద్రత విశేషతలలో ఈబిఎస్ తో ముందువైపు,వెనుకవైపు డిస్క్ బ్రేక్స్, సిసిఎస్2 ప్రోటోకాల్ ఫాస్ట్ చార్జర్, 4 కెమెరాస్, అత్యవసర స్టాప్ బటన్, అగ్నిమాపక యంత్రము, ఆటోమాటిక్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడిఏఎస్) ఉన్నాయి. అతితక్కువ గురుత్వాక ర్షణ శక్తితో రూపొందించబడిన ఈకేఏ E9 అధిక వేగాలు,మలుపుల వద్ద స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది,రద్దీగా,సమ్మర్ధంగా ఉన్న నగర ట్రాఫిక్ లో దీనిని డ్రైవ్ చేయడము చాలా సులభంగా ఉంటుంది.
ప్రారంభ కార్యక్రమములో మాట్లాడుతూ, డా. సుధీర్ మెహతా, చెయిర్మెన్, ఈకేఏ & పిన్నకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈ విధంగా అన్నారు, “భారతదేశపు డీకార్బొనైజేషన్ వ్యూహములో వాణిజ్య వాహనాల విద్యుద్దీకరణ, ప్రజా రవాణా, ముఖ్యంగా బస్ విభాగం, కీలకమైనది. ఈనాడు, తమ సున్నా-ఉద్గారాల లక్ష్యాలను సాధీంచుటకు నగరాలకు సాధికారతను అందించుటకు మా మొట్టమొదటి విద్యుత్ బస్ అయిన ఈకేఏ E9 ను ప్రారంభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మా బస్సులు ఉత్తమ స్వారీ అనుభవాన్ని, శుభ్రమైన పర్యావరణాన్ని,వినియోగదారులకు ఉత్తమ రిటర్న్స్ ను అందించుటకు రూపొందించబడ్డాయి & అనుకూలపరచబడ్డాయి. కొత్త ఈకేఏ E9 తో, ఎలెక్ట్రోమొబిలిటీ కి మారటానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమైన మార్కెట్స్ పై ఉన్న డిమాండ్ ను అందుకొనుటకు మేము పరిశుభ్రమైన, సమర్థవంతమైన, లాభదాయక మైన ప్రజా రవాణా కొరకు ఒక ప్రపంచవ్యాప్త వేదికను అందిస్తున్నాము.”

ఈకేఏ, భారతదేశపు ఆటోమోటివ్ సీటింగ్, ఇంటీరియర్స్ & స్పెషాలిటీ వాహనాల కంపెనీ అయిన పిన్నకిల్ ఇండస్ట్రీస్, ఒక అనుబంధ సంస్థ,బారత ప్రభుత్వము ,ఆటో పీ ఎల్ ఐ పాలసీ,ఛాంపియన్ ఓఈఎం పథకము & ఈవి కాంపొనెంట్ తయారీ పథకము కింద ఆమోదించబడిన ఒకే ఒక్క వాణిజ్య వాహనాల తయారీదారులు.
ఈకేఏ, ఉత్తమ టిసిఓ (మొత్తం యాజమాన్య ఖర్చు) పరిష్కారాలు, ఒక సుస్థిరమైన పర్యావరణ వ్యవస్థతో ఈవీలను ప్రజాస్వామికం చేయుటకు షేరబుల్ సాంకేతికత లను అభివృద్ధి చేయడము ద్వారా విద్యుత్ వాణిజ్య వాహనాల డిజైన్ ఫిలాసఫీని తిరిగి ఆవిష్కరిస్తోంది,తయారుచేస్తోంది. ఈకేఏ విద్యుత్ వాహనాలు, ఫ్యూయల్ సెల్ ఎలెక్ట్రిక్ వాహనాలు,ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల సంపూర్ణ శ్రేణిని రూపొందిస్తుం ది, తయారు చేస్తుంది ,సరఫరా చేస్తుంది. ఈ బ్రాండ్ నుండి విడిభాగాల అసెంబ్లీ , తయారీ, ఈవి ట్రాక్షన్ వ్యవస్థలు, ఈవి ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు మొదలైనవాటిని కూడా అందిస్తుంది.