Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 30,2024:నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి,శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ 50 రోజుల యాత్ర పూర్తి చేసుకుంది.

సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నానికి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కులు, సినీ సెల‌బ్రిటీలు అందించిన అభినంద‌న‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ చిత్రం, డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిలో ఎప్పుడూ ఉన్న ఆద‌ర‌ణ‌ను మ‌రోసారి నిరూపించింది.

ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన నిర్మాత ఫ‌ణి అడ‌పాక మాట్లాడుతూ, “ఈ సినిమా ప్రారంభ‌మైన విజ‌యం ఇంకా గొప్ప విజ‌యాల‌తో కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ య‌దు వంశీ మొద‌టి సినిమాతోనే మంచి స‌క్సెస్‌ను అందుకున్నారు” అన్నారు.

చిత్రదర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ, “ఈరోజుల్లో 50 రోజులు సినిమా పూర్తి చేసుకోవ‌డం అరుదు. మా తొలి సినిమాకే ఇలా జరగుతుందని అనుకోలేదు. నిహారిక‌ మా టాలెంట్‌ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు” అన్నారు.

చిత్ర సమర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ, “ఈ క్ష‌ణాల‌ను ఎప్పటికీ మ‌ర‌చిపోలేం. 50 రోజుల స‌క్సెస్‌ఫుల్ ర‌న్‌ను చూసి ఆనందిస్తున్నాం” అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ, “నాగబాబుగారు ప్రొడ్యూస్ చేసిన ‘రుద్రవీణ’ చిత్రానికి, ‘గుడుంబా శంక‌ర్’ చిత్రానికి డిస్ట్రిబ్యూట‌ర్‌ను గా ఉన్నాను. ఇప్పుడు నిహారిక నిర్మించిన సినిమాకు రావడం ఆనందంగా ఉంది” అన్నారు.

నాగ‌బాబు మాట్లాడుతూ, “‘కమిటీ కుర్రోళ్ళు’ స‌క్సెస్‌లో భాగ‌మైన టీమ్ అంద‌రికీ అభినంద‌న‌లు” అని అన్నారు.

ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రికీ 50 డేస్ మెమొంటోని బ‌హూకరించారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని రూపొందించిన టీమ్‌ను ఈ సందర్భంగా అభినందించారు.

error: Content is protected !!