365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 9,2024:ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, టి.శోభారాణి ఆగష్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం, 15 స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా స్కూల్లో, కాలేజీల్లో వ్యాస రచన, పాటలు పోటీలు నిర్వహిస్తున్నామని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు .
డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో పత్రికా విలేఖరులతో మాట్లాడారు. నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్ర ల్లో స్వాతంత్ర్య దినోత్సవం గురించి, దేశభక్తి గీతాలు, పద్యాలు పాటలు,జాతీయ సమర యోధులపై వ్యాసరచన పోటీలు, స్లమ్ ఏరియాలో, ప్రభుత్వ హాస్టల్ ,స్కూల్లో, కాలేజీ ల్లో, రామకృష్ణ మఠం బాలల సేవా విభాగం లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా లయన్స్ పి.స్వరూపా రాణి,జి.కృష్ణ వేణి, టి. శోభా రాణి, జ్యోతి రాజా వ్యవహరిస్తారు న్నారు.
స్వాతంత్ర్యం దినోత్సవాలు వస్తున్నాయి చేస్తున్నాం…వెళ్ళి పోతున్నాయి….. ఎందుకు, చేయాలి, చేస్తున్నాం అనేది నేటి విద్యార్థులకు క్వశ్చన్ మార్క్ …. అందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫల మన్నారు. బహుమతులను అందజేసే రోజున క్లబ్ * 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ *డా.డి.కొటేశ్వరరావు, 1వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ *డా.మహేంద్ర కుమార్ రెడ్డి, ఆర్.సి.*డా.వి.శ్రీనివాస్, సి.హెచ్.గోపాల కృష్ణ, జె.సి.బి.వినయ్,బి.వనిత, పాల్గొంటారన్నారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో, ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయ నాడులో వరదలతో అతలాకుతలమైన అక్కడి ప్రజలకు, ఆ ప్రాంతాన్ని తిరిగి పునర్నిర్మాణం కొరకు కేరళ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ -318 అక్షరాల ఐదు కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ హిప్నో థెరపీస్ట్
@ 9390044031