

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూలై 7, 2021: బర్ద్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు జూలై 20 వ తేదీలోపు పూర్తి కావాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ఈ పనుల పురోగతిని పరిశీలించారు.


ఆసుపత్రిలో నిర్మిస్తున్న మూడు ఆపరేషన్ థియేటర్లు, ఓపి, ఐసీయూ, జనరల్ వార్డులు, ల్యాబ్, పరిపాలనా విభాగాల నిర్మాణం పనులను ఆయన చూశారు. పనుల వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వైద్య పరికరాలు, ఫర్నీచర్, ఇతర మిషనరీ పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు ఇసుక ఇబ్బంది ఉందా అని ఆరా తీశారు.

