Mon. Dec 23rd, 2024
Concluded Poly Tech Fest 2022

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 26,2022: మార్కులు తెచ్చుకోవటమే విద్యాభ్యాసం కాదని, జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవడమే విద్య అని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సాంకేతిక విద్యా శాఖ గత మూడు రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పాలీ టెక్ ఫెస్ట్ 2022 ముగింపు కార్యక్రమం నగరంలోని ఎస్ ఎస్ కన్వేన్షన్ లో శనివారం వేడుకగా సాగింది.

విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు బహుమతులు అందచేసారు. ముఖ్య అతిధిగా హాజరైన వనిత మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించే అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులు అభినందనీయులన్నారు.

భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవాలన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి, వాటిని అధికమించేందుకు సిద్దం కావాలన్నారు. స్వార్థ ప్రయోజనాల గురించి ఏనాడూ ఆలోచించని ముఖ్యమంత్రి విద్యార్ధుల కోసం విభిన్న పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ నేటి విద్యార్ధులే రేపటి శాస్త్ర వేత్తలని, ప్రపంచ పోటీని తట్టుకునేలా ప్రతి విద్యార్ది తయారు కావాలన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహాంతో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, మాతృభూమికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.

విద్యార్థులు తమ నైతిక ప్రవర్తనను పెంపొందించుకోవాలని, సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా నడవడిక ఉండరాదని ఉద్బోదించారు. విద్యార్థుల సంక్షేమం, ఉపాధి కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నమన్నారు.

Concluded Poly Tech Fest 2022

సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తగిన ప్రోత్సాహం అందిస్తే విద్యార్ధులు తమదైన శైలిలో రాణిస్తారన్న విషయం ఈ టెక్ ఫెస్ట్ నిరూపించిందన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం ఈ సాంకేతిక ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు సాంకేతిక విద్యను పరిశ్రమతో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎపి ఇన్నోవేషన్ సొసైటీ సిఇఓ అనిల్ కుమార్, సాంకేతిక విద్యాశాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు కార్యదర్శి విజయ భాస్కర్, ఇతర అధికారులు సత్యనారాయణ మూర్తి, ఎ.నిర్మల్ కుమార్ ప్రియ తదితరులు పాల్గొన్నారు.

టెక్ ఫెస్ట్ లోగో రూపకల్పనలో దాదాపు 90 మంది పాలిటెక్నిక్‌లు పాల్గొనగా, గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద్యర్ధులు ఉత్తమమైన లోగో రూపొందించి ఐదువేల రూపాయల నగదు బహుమతి పొందారు. పాలీ టెక్ ఫెస్ట్ లో విజేతలు : 253 ప్రాజెక్టులలో లక్ష రూపాయల రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ బృందం రూపొందించిన “స్మార్ట్ స్టిక్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్” కు దక్కింది.

యాభైవేల రూపాయల రెండవ బహుమతి ఒంగోలు జిల్లా వల్లూరు కృష్ట సాయి పాలిటెక్నిక్ బృందం తయారు చేసిన ఆటోమొబైల్ క్రాష్ డిటెక్షన్ & ఇంటీమేషన్ కు లభించింది. 13 ప్రాజెక్టులకు తృతీయ బహుమతిని అందించగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, సూరంపాలెం, కాకినాడ, ప్రభుత్వ పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం, మహిళల ప్రభుత్వ పాలిటెక్నిక్, హిందూపూర్, లయోలా పాలిటెక్నిక్, పులివెందుల , ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, వైజాగ్.

Concluded Poly Tech Fest 2022

ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్, శ్రీకాకుళం. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీ, గూడూరు. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆఫ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, గుంటూరు, ప్రభుత్వం పాలిటెక్నిక్, కర్నూలు. ప్రభుత్వ పాలిటెక్నిక్, వైజాగ్. అల్-హుదా పాలిటెక్నిక్, నెల్లూరు, మైనారిటీ ప్రభుత్వ పాలిటెక్నిక్, కర్నూలు, మహిళల ప్రభుత్వ పాలిటెక్నిక్, ఉన్నాయి.

error: Content is protected !!