365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ ,జనవరి 26,2021:ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఈ మేరకు మోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, “పద్మఅవార్డులు పొందిన వారందరినీ, చూసి మేము గర్విస్తున్నాము.దేశానికి,ప్రధానంగా,మానవత్వానికి వారు చేసిన సేవలను, భారతదేశం ఎప్పుడూ కీర్తిస్తుంది.వివిధ రంగాలకు చెందిన,ఈ అసాధారణ వ్యక్తులు, ఇతరుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు.” అని పేర్కొన్నారు.
