365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జనవరి 27,2023: అదానీ గ్రూప్, “జనవరి 24, 2023న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక హానికరమైనది. ఎలాంటి పరిశోధన లేకుండానే దీన్ని తయారు చేశారు. ఈ తప్పుదారి పట్టించే నివేదిక అదానీ గ్రూప్‌ను, మా వాటాదారులు ,పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
ఈ నివేదిక కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు తలెత్తడం చాలా ఆందోళన కలిగించే విషయం. భారతీయులకు అనవసరమైన బాధను కలిగించింది. హిండెన్‌బర్గ్ ధృవీకరించని విషయాలను ప్రచురించిందని అదానీ గ్రూప్ తెలిపింది.
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలపై దుష్ప్రభావం చూపేలా దీన్ని రూపొందించారు. ఆర్‌బీఐ, సెబీల చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు శుక్రవారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ,సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ ద్వారా విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
దీనిపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఒక వ్యక్తి కంపెనీ లేదా వ్యాపార సమూహానికి వ్యతిరేకంగా హెడ్జ్ ఫండ్ రూపొందించిన పరిశోధన నివేదికపై రాజకీయ పార్టీ సాధారణంగా స్పందించకూడదని, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిస్పందన అవసరం. అదానీ గ్రూపు మామూలు గ్రూప్ కాదు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆరోపణలు-వాస్తవాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.