365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,22,ఏప్రిల్,2021: రాజధాని నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కరంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు విలయతాండవం చేస్తుండగా జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా తీవ్రత ఎక్కవ ఉన్న ప్రాంతాలను గుర్తించిన జీహెచ్ఎంసీ పలు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. కరోనా కట్టడికి చర్యలు చేపట్టిన అధికారులు గురువారం నగరంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను 63 కంటైన్‌మెంట్ జోన్లుగా విభజించారు.
ఎల్‌బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా సర్కిల్, ఉప్పల్, హయత్ నగర్, ఎల్‌బీనగర్, సరూర్‌నగర్ లలో రెండు కంటైన్‌మెంట్‌జోన్లు, చార్మినార్ జోన్‌పరిధి మలక్‌పేట సర్కిల్ , సంతోష్‌నగర్‌లో , చాంద్రయానగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా , రాజేంద్రనగర్‌లలో రెండు జోన్లు, ఖైరతాబాద్ జోన్‌లో మెహిదిపట్నం , కార్వాన్, గోషామహాల్, జూబ్లీహిల్స్‌లో రెండు జోన్లు, శేర్‌లింగంపల్లి జోన్ యుసఫ్‌గూడ సర్కిల్‌లో మూడు, శేర్‌లింగంపల్లి లో రెండు, చందానగర్‌లో మూడు. పటాన్ చెరులో రెండు కంటైమేంట్ జోన్లుగా ప్రకటించారు. ఇక కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసపేట సర్కిల్‌లో రెండు, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, ఆల్వాల్ పరిధిలో రెండు, సికింద్రాబాద్‌జోన్ అంబర్‌పేట, ముషిరాబాద్‌లలో రెండు, మల్కాజీగిరిలో మూడు, సికింద్రాబాద్‌లో రెండు, బేగం పేట సర్కిల్‌లో రెండు కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు.