Sat. Nov 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 21,2023: గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో షోల్డర్ డిసీజెస్ పై సోమవారం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ నిర్వహించారు.

కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో అత్యుత్తమ ఆర్థోపెడిక్ టీమ్ డాక్టర్ కె గౌతమ్ చౌదరి, డాక్టర్ జికె సుధాకర్ రెడ్డి, డాక్టర్ చక్రధర్ రెడ్డి, డాక్టర్ అరుణ్ రెడ్డి, డాక్టర్ చరణ్ రెడ్డి, డాక్టర్ కె వరుణ్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు హాజరై భుజ వైకల్యానికి సంబంధించి రోగ నిర్ధారణ, చికిత్స, నివారణపై అవగాహన కల్పించారు. https://continentalhospitals.com/

కాంటినెంటల్ ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ జీవనశైలి, ఒకే భంగిమలో ఎక్కువ గంటలు కూర్చోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటివన్నీ మనల్ని భుజం సంబంధిత వ్యాధులకు గురిచేస్తాయి” అని తెలిపారు.

జిమ్ వర్క్ అవుట్‌లు, గోల్ఫ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తరహా క్రీడా కార్యకలాపాలు సరైన మార్గనిర్దేశం చేయకపోతే తీవ్రమైన ,దీర్ఘకాలిక భుజాల గాయాలకు దారితీస్తాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వీటిపై సరైన అవగాహన తప్పక కలిగి ఉండాలని అన్నారు.

కాంటినెంటల్‌లో భుజ సంబంధ వ్యాధులను నివారించడంతోపాటు ఉత్తమ చికిత్స, సంరక్షణ అందించే లక్ష్యంతో మేము అన్ని భుజ వ్యాధులకు అందించే మా 360-డిగ్రీల విదానం పేషంట్ పూర్తి సంరక్షణకు దోహద పడుతుందని డాక్టర్ గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. https://continentalhospitals.com/

కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ చీఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ యెల్దండి అధ్యక్షత వహించిన ఈ వర్క్‌షాప్‌కు వివిధ ఆసుపత్రుల నుంచి పలువురు వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, విద్యార్థులు, తదితరులు హాజరయ్యారు. https://continentalhospitals.com/

error: Content is protected !!