365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 10,2024: భారతదేశం లోని సుప్రసిద్ధ వ్యవసాయ పరిష్కారాల ప్రదాత కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్‌లో జరిగిన గ్రోమర్ రైతు సంబరాలు మెగా లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేయటంతో పాటుగా వేడుకలు చేసుకోవడం ద్వారా రైతు సమాజంతో తన శాశ్వత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది.

భారతదేశ వ్యవసాయ పురోగతిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు ట్రాక్టర్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్‌సైకిళ్లను ప్రదానం చేశారు.

రైతులు, ఛానెల్ భాగస్వాములు,సీనియర్ కంపెనీ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమం, రైతుల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడం. వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడంలో కోరమాండల్ స్థిరమైన నిబద్ధతను ప్రతిబింభించింది.

కోరమాండల్ గ్రోమోర్ ఎరువులను కొనుగోలు చేసిన రైతుల కోసం లక్కీ డ్రాతో కూడిన గ్రోమర్ రైతు సంబరాలు కార్యక్రమం, వినూత్న పరిష్కారాలను అందించడం.రైతుల సహకారాన్ని గుర్తించడం ద్వారా రైతులతో అర్ధవంతమైన సంబంధాలను పెంపొందించడంలో కోరమాండల్ అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.

విజేతలుగా నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ నుంచి శ్రీధర్,తెలంగాణ నుంచి మొఘల్ బాషాలకు ట్రాక్టర్లను కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఎస్ శంకరసుబ్రమణియన్ అందజేశారు.

కంపెనీ ఉన్నతాధికారులు శ్రీ అమీర్ అల్వీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ – ఫర్టిలైజర్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాధబ్ అధికారి, విపి , సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ – ఫర్టిలైజర్స్ &ఎస్ ఎస్ పి , కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జి వి సుబ్బారెడ్డి, విపి , డి ఎన్ హెచ్ – సౌత్ 1, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లు రెండు రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచిన ఎనిమిది మంది రైతులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ ఎస్ శంకరసుబ్రమణియన్ మాట్లాడుతూ, “మన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రైతుల అచంచలమైన అంకితభావాన్ని జరుపుకోవడం మాకు గౌరవంగా ఉంది.

ఈ కార్యక్రమం, మన వ్యవసాయ సమాజంతో మేము పంచుకుంటున్న బలమైన సంబంధానికి నిదర్శనం, వినూత్న పరిష్కారాలు,నిరంతర మద్దతు ద్వారా వారిని శక్తివంతం చేయాలనే కోరమాండల్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

మేము విజేతలను అభినందిస్తున్నాము,తమ నమ్మకం,సహకారం అందించిన రైతులందరికీ ధన్యవాదాలు. వ్యవసాయ కమ్యూనిటీని వేడుక జరుపుకోవడానికి మద్దతు ఇవ్వడానికి మరిన్ని అవకాశాల కోసం కంపెనీ ఎదురుచూస్తోంది..” అని అన్నారు.

ఈ కార్యక్రమం విజేతలను సన్మానించే వేదిక మాత్రమే కాకుండా కోరమాండల్ మరియు రైతు సమాజానికి మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాన్ని వేడుక చేసుకునే ఉత్సవంగా నిలిచింది. తమ వ్యవసాయ పద్ధతులు, జీవనోపాధిని కంపెనీ కార్యక్రమాలు సానుకూలంగా ఎలా ప్రభావితం చేశాయో వెల్లడిస్తూ కోరమాండల్ నిరంతర మద్దతుకు రైతులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

అవార్డుల వేడుకతో పాటు, కోరమాండల్ తమ నూతన నానో డిఏపి, నానో యూరియా , గ్రోమోర్ డ్రైవ్ డ్రోన్ సర్వీసెస్‌తో సహా దాని ఆఫర్‌లను ప్రదర్శించింది, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం .రైతుల ఉత్పాదకత,శ్రేయస్సును పెంచడంలో తన లక్ష్యాన్ని నొక్కి చెప్పింది.