365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,మార్చి 31,2023: కరోనా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. పలుదేశాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ఒకదేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో ఒక భారతీయుడికి పాజిటివ్‌గా తేలడంతో నేపాల్ మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేసింది నేపాల్. మాస్క్ లేకుండా జులాఘాట్ మీదుగా నేపాల్ వెళ్లే వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు.
టీవీ నటి మహి విజ్‌కి కరోనా..
ప్రముఖ టీవీ నటి మహి విజ్‌కి కరోనా సోకింది. సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ నటి సమాచారం ఇచ్చింది. నాకు కోవిడ్ వచ్చింది. మొదట నాకు జ్వరం, జలుబు వచ్చింది, అప్పుడు అందరూ నన్ను పరీక్ష చేయించుకోవద్దని చెప్పారు, కానీ నేను పరీక్ష చేయించుకున్నాను. ఇప్పుడు నాకు కరోనా సోకింది”అని ఆమె చెప్పారు.