365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్,న్యూస్,అమరావతి,ఆగస్టు 17, 2020: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,780 కరోనా కేసులు నమోదయ్యాయి. 82 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,609 కి చేరింది.
మొత్తం 44,578 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 84,777గా ఉంది. ఇప్పటివరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,732 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.