365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,ఏప్రిల్ 7,2023: దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
చాలా చోట్ల మాస్కులు కూడా తప్పనిసరి చేశారు. పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించారు. వీటన్నింటి మధ్య, పుదుచ్చేరిలో వెంటనే అమలులోకి వచ్చేలా కరోనా ఆంక్షలు అమలు చేశారు.
24 గంటల్లో 6,050 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వల్ల తాజాగా 14 మరణాలు నమోదు కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతానికి చేరింది. తాజాగా గత 24 గంటల్లో 6,050 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటింది.
గురువారంతో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్ వల్ల తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి. దాంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వెంటనే అమలులోకి వచ్చేలా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడాన్ని పుదుచ్చేరి పరిపాలన శుక్రవారం తప్పనిసరి చేసింది. పుదుచ్చేరి కలెక్టర్ వల్లవన్ మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా వైరస్ పాజిటివ్ రేటు గణనీయంగా పెరిగిందన్నారు.
బీచ్, థియేటర్లు ఇతర ప్రదేశాలలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని అన్నారు. దీంతో పాటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
కరోనా మార్గదర్శకాలు..?
- బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
- పార్కులు, థియేటర్లు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.
- హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లు, మద్యం షాపుల సిబ్బందితో పాటు వినోద రంగానికి చెందిన వారందరూ మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది.
- -విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పాఠశాలలు, కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.