Mon. Oct 7th, 2024
Corona Effect ... All the weddings are stopped

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 10,హైదరాబాద్: లాక్ డౌన్ తో ఒకటో, రెండో కాదు.. వందలాది పెండ్లిళ్ళు ఆగిపోయాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. ఆ వాయిదా పడిన పెడ్లిళ్ళు ఎప్పుడు జరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొన్నది. కరోనా భయం, లాక్‌డౌన్‌ ప్రభావమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు విదేశాల్లో, మన దేశంలోనే వేర్వేరు ప్రాంతాలు, నగరాల్లో చిక్కుకుపోయారు. వారి సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో మరికొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మే 4న విజయవాడలోని వివాహం జరగాల్సిన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ అమెరికాలోనే చిక్కుకుపోయారు. వారు ఇప్పట్లో భారత్‌కు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా వేశారు. పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి విశాఖపట్నంలో, అమ్మాయి హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు.

ఈ నెల 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ వివాహమూ వాయిదా పడింది. భూగర్భ జలశాఖలో పనిచేసే ఉన్నతాధికారి కుమార్తెకు ఈ నెల 11న రాజమహేంద్రవరంలో వివాహం జరపాలని నిర్ణయించారు. కల్యాణ వేదిక సహా అన్నింటికీ అడ్వాన్సులు చెల్లించేశారు. శుభలేఖల పంపిణీ పూర్తయిపోయింది. లాక్‌డౌన్‌తో పెళ్లిని తాత్కాలికంగావాయిదా వేశారు. తెలంగాణలో కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీకాకుళం జిల్లా యువకుడికి ఈ నెల 15న పెళ్లి జరగాల్సి ఉంది. నెల రోజుల కిందటే ఏర్పాట్ల కోసం అడ్వాన్సులు ఇచ్చేశారు. కరోనా నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేశారు. కొందరు ముందుగానే శుభలేఖలు పంచేశారు. ప్రస్తుతం పెళ్లి వాయిదా పడిందని ఫోన్లలో సమాచారమిస్తున్నారు.

కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌, డెకరేషన్‌, లైటింగ్‌, బ్యాండ్‌, మ్యారేజ్‌ ఈవెంట్‌ నిర్వాహకులకు అడ్వాన్సులు చెల్లించేశారు. మళ్లీ తాము అనుకున్న తేదీలకు అవి కుదురుతాయో లేదోనన్న ఆందోళన ఉన్నది.ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా? లేదా? అనేది స్పష్టత లేకపోవటంతో నిరవధికంగా వాయిదా వేసుకుంటున్నారు.

error: Content is protected !!