Fri. Nov 22nd, 2024
WFH_CORONAV

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,డిసెంబర్ 26,2022: భారతదేశం లో కరోనా వైరస్ భయాలు పెరుగుతున్నాయి. ఇక ఫోర్త్ వేవ్ తప్పదని ఐటీ కంపెనీలు ఇప్పటికే డిసైడ్ అయిపోయాయి.

ఆతిథ్యం, రవాణా, టూరిజం ,రియల్ ఎస్టేట్‌తో సహా పలు రంగాలలోని కంపెనీలు దేశంలో ఫోర్త్ వేవ్ మొదలైతే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాయి.

“గతంలో కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా పలు రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్య తగ్గించు కునే పనిలో పడ్డాయి.

ఈ కారణంగా పర్యాటకం, ఆతిథ్యం రంగాల్లో ఉన్న కంపెనీలు మరింత జాగ్రత్త పడుతున్నాయి. తయారీ రంగంతోపాటు ఇతర రంగాలలో ఉన్న సంస్థలు ” తమ ఉద్యోగులను తొలగించలేదు.

పశ్చిమ దేశాలలో ఆర్ధిక మందగమనం కారణంగా ఇటీవలి కాలంలో నియామకాల సెంటిమెంట్‌లు ప్రభావితమవుతున్నాయని, నియామకాల ప్రక్రియ గత సంవత్సరం లాగా ఉండకపోవచ్చు.

WFH_CORONAV

హాస్పిటాలిటీ, ఆటోమొబైల్, కమర్షియల్, ఆఫీస్ రియల్ ఎస్టేట్, ట్రావెల్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ మొబిలిటీ వంటివి హై అలర్ట్‌గా ఉంటాయని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరీర్‌నెట్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు అన్షుమాన్ దాస్ పేర్కొన్నారు.

చైనాతోపాటు ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ వైరస్ ను రూపుమాపడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.

గయా విమానాశ్రయంలో నలుగురు విదేశీ పౌరులు కోవిడ్ పాజిటివ్ గా వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నలుగురినీ బోధ్ గయలోని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌కు తరలించారు.

error: Content is protected !!