365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 6,2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ లు, అలాగే విశ్వవిద్యాలయం చే గుర్తింపు పొందిన ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో రెండు సంవత్సరముల వ్యవసాయం.
సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు,మూడు సంవత్సరముల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీ నుంచి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
పాలీసెట్- 2024 ర్యాంకులు పొందిన అభ్యర్థులను మెరిట్,రిజర్వేషన్ నిబంధనల ప్రకారముగా ప్రవేశాలు నిర్వహిస్తారు.
ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన షెడ్యూల్ , అభ్యర్థులు తీసుకురావలసిన సర్టిఫికెట్లు, ఫీజు తదితర వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in ను చూడగలరు.
అభ్యర్థులు కౌన్సిలింగ్ కు షెడ్యూల్ ప్రకారం వారి ర్యాంకుల వారిగా కౌన్సిలింగ్ కు హాజరుకావాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ పి. రఘురామి రెడ్డి తెలియజేశారు.