365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరుజూలై23,2023: బెంగళూరులో 2.5 టన్నుల టమోటాలతో ట్రక్కును హైజాక్ చేసినందుకు తమిళనాడుకు చెందిన దంపతులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరుకు చెందిన దంపతులు హైవే దోపిడీలకు పాల్పడే ముఠా సభ్యులు.
జూలై 8న చిత్రదుర్గ జిల్లా చిక్కజాల వద్ద హిరియూరుకు చెందిన రైతు మల్లేష్‌ను దంపతులు ఆపి తమ కారును ట్రక్కు ఢీకొట్టిందని చెప్పి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బు ఇవ్వడానికి మల్లేష్ నిరాకరించడంతో భార్యాభర్తలు అతనిపై దాడి చేశారు.
భార్యాభర్తలు లారీ డ్రైవర్‌ను బలవంతంగా ట్రక్కు నుంచి దించి రూ.2.5 లక్షలకు పైగా విలువైన 2.5 టన్నుల టమాటాలను తీసుకుని ట్రక్కుతో పరారయ్యారు. రైతు ఫిర్యాదు మేరకు ఆర్‌ఎంసి యార్డు పోలీసులు ఆ ముఠాను గుర్తించి భాస్కర్ (28), అతని భార్య సింధూజ (26)లను శనివారం అరెస్టు చేశారని, వీరికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.