Thu. Nov 7th, 2024
Dr.-Hypno-Padma-Kamalakar

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మార్చి 5,2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా రామకృష్ణ మఠం బాలల సేవా విభాగం లో శారదా మాత పై డ్రాయింగ్, వ్యాసారచన పోటీలలో గెలుపొందిన వారికి మహారాజ్ రఘునందన్, డా.హిప్నో పద్మా కమలాకర్, ఆరతి,జి.కృష్ణవేణి, బహుమతులు, పుస్తకాలు, చాక్లెట్స్, కేకులు అందజేసారు.

ఈ కార్యక్రమం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మాయికి ధైర్యమే అందం, ఆరోగ్యం మని తెలిపారు. ధైర్యం గా ఉంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కో వచ్చన్నారు.

మహిళా దినోత్సవం అందరి సమిష్టి కృషిపై ఆధారపడి ఉంటుందన్నారు. మహిళలు ఈ సాంకేతిక విప్లవంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. సమాజంలో వేళ్లూనికుపోయిన లైంగిక అసమానతల వల్లనేని చెప్పారు. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఒక థీమ్‌/నినాదం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ”లింగ సమానత్వం కోసం డిజిటల్‌ ఇన్నోవేషన్‌, సాంకేతికత” తో ముందుకొచ్చిందన్నారు.

ఈ డిజిటల్‌ యుగంలో ప్రపంచవ్యాప్తంగా 37శాతం మహిళలు ఇంటర్నెట్‌ వాడడం లేదని స్పష్టం చేశారు. ప్రతిదీ డిజిటల్‌ ప్రక్రియ ద్వారా జరుగుతున ప్పటికీ, భవిష్యత్తు అంతా డిజిటల్‌ సాంకేతికత ఆవిష్కరణలే పెరిగినప్పటికీ మహిళలు అత్యాధునిక డిజిటల్‌ నైపుణ్యాలకు అందనంత దూరంలోనే ఉన్నారన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో అత్యాధునిక సాంకేతికత లింగ సమానత్వం సాధించడాని ప్రయత్నిస్తూ,అన్నింటా సమం కావాలిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.కృష్ణ వేణి, నవభారత లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ గోపాల కృష్ణ.సిహెచ్ , ఉపాధ్యక్షుడు బి.వినయ్ , బాలురు, బాలికలు పాల్గొన్నారు.

డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్,సైకో థెరపీస్ట్,హిప్నో థెరపీస్ట్
@ 9390044031

error: Content is protected !!