365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 22, 2025: భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 మరో అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస హిట్‌లను అందించిన ZEE5 తెలుగు, ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా *‘J.S.K – జానకి V/s స్టేట్ ఆఫ్ కేరళ’*ను ఆగస్టు 22న ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జే. ఫణీంద్ర కుమార్ నిర్మించిన ఈ సినిమా, లైంగిక వేధింపుల బాధితురాలు జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) న్యాయం కోసం సాగించిన పోరాటం చుట్టూ తిరుగుతుంది.

ప్రముఖ న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో ఆమె సాగించిన ఈ న్యాయయుద్ధం చివరకు ఎటువంటి ఫలితాన్నందించింది? అసలు జానకి జీవితంలో ఏమి జరిగింది? న్యాయం అంటే నిజంగా ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రేక్షకులు ఈ కథను ఆసక్తిగా వీక్షించాల్సిందే.

Read This also…ZEE5 Brings Courtroom Drama J.S.K – Janaki V/s State of Kerala in Telugu from August 22..

గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, ఘిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం, రెనదివే సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు.

ఆగస్టు 22 నుంచి ZEE5లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్న *‘J.S.K – జానకి V/s స్టేట్ ఆఫ్ కేరళ’*తో ఈ వీకెండ్ ఉత్కంఠభరితమైన కోర్ట్ రూమ్ డ్రామాను ఆస్వాదించండి.