365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జెంగ్‌జౌ,నవంబర్ 26,2022: మరోపక్క చైనాలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోద వుతున్నాయి. దీంతో వారం రోజుల పాటు ఫ్యాక్టరీలు మూసేశారు.అంతేకాదు ప్రధాననగరాల్లో అంతటా మహమ్మారి లాక్‌డౌన్‌లు విదిస్తున్నారు.
6.6 మిలియన్ల జనాభా ఉన్న జెంగ్‌జౌలోని ఎనిమిది జిల్లాల నివాసితులు గురువారం నుంచి ఐదు రోజులు ఆహారం కొనడంకోసం కూడా బయటకు రావద్దని ఆదేశాలు జారీచేశారు. చికిత్స కూడా ఇంట్లోనే ఉండి తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు.

గత 24 గంటల్లో, కొత్త కోవిడ్ కేసుల సంఖ్య 31,444 పెరిగిందని జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. 2019 చివరలో సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో కరోనావైరస్ మొదటిసారి కనుగొననప్పటి నుంచి ఇది అత్యధిక రోజువారీ సంఖ్య అని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.