365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,2 జూన్ 2021: తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన టిటిడి రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేడు తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల కేంద్రీయ వైద్యశాలలో కోవిషీల్డ్ మొదటి డోస్ వేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
COVISHIELD FIRST DOSE VACCINATION for ttd employees
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించి కోవిషీల్డ్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోగలరు.