
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 29,2021: గో ఆధారిత ఉత్పత్తులతో గోవిందునికి సంపూర్ణ నైవేద్యం కోసం తిరుమల బయలుదేరిన ప్రత్యేక వాహనాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ..”ఎలాంటి ఎరువులు, రసాయనాలతో కలుషితం కాకుండా పూర్తిగా ప్రకృతి సిద్ధంగా పండించి సేకరించిన పదార్దాలతోనే స్వామి వారికి నివేదన చేయాలని అద్భుతమైన సంక్పలం చేయడం చాలా మంచి ఆలోచన “అని స్వామీజీ అన్నారు.

” ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైనది, శ్రీవారి భక్తులకు ఇదొక శుభ సమాచారం ,ఇలాంటి సేవ చేసుకోగలగడం ఒక అదృష్టం, ఇలాంటి కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందని డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు అన్నారు. కలియుగాంతం వరకు ఈ కార్యక్రమం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మూడు నెలల పాటు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సంపూర్ణ నైవేద్యానికి అవసరమైన గోఆధారిత ఉత్పత్తులను యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయకర్తలు యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ కొలిశెట్టి శివ కుమార్, గో ఆధారిత వ్యవసాయ మహర్షి విజయ రామ్,యుగ తులసి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.