Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, 15 ఏప్రిల్‌ 2022 : దేశంలో ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌తో ఏర్పడిన అపెక్స్‌ బాడీ కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌), నేడు 11వ ఎడిషన్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022ను నగరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022 మాదాపూర్‌లోని హైటెక్స్‌లో 29 ఏప్రిల్‌ 2022 మరియు 01 మే 2022 తేదీ వరకూ జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రోపర్టీ షోలో నగరవ్యాప్తంగా ఉన్నటువంటి సభ్య డెవలపర్లు, మెటీరియల్‌ వెండార్లు, బిల్డింగ్‌ మెటీరియల్‌ మాన్యుఫాక్చరర్స్‌, కన్సల్టెంట్స్‌,ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఒకే దరికి రావడంతో పాటుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోఅత్యాధునిక ఆవిష్కరణలను ఒకే గొడుగు కింద ప్రదర్శించనున్నారు.

ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్స్‌కు తగినట్లుగా డెవలపర్లు ప్రోపర్టీలను ప్రదర్శించనున్నారు. తద్వారా వినియోగదారులకు జంట నగరాల్లో
అత్యుత్తమ గృహ పరిష్కారాలను పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రదర్శన లో కేవలం టీఎస్‌–రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్ప్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, గ్రీన్‌ బిల్డింగ్స్‌ వంటివి రిటైల్‌ ,వాణిజ్య కాంప్లెక్స్‌, ఓపెన్‌ ప్లాట్స్‌ మొదలైనవి ఉండనున్నాయి. వీటితో పాటుగా ప్రదర్శనకు వచ్చి కొనుగోలు పట్ల ఆసక్తి చూపే వారికి బ్యాంకులు,ఆర్థిక సంస్థలు తగిన మద్దతునం దించనున్నాయి.మహమ్మారి అనంతర కాలంలో నిర్వహిస్తున్న ప్రదర్శన కావడం చేత ఈ ఎడిషన్‌ మరింత ప్రతిష్టాత్మకం కావడంతో పాటుగా మరింత ప్రాచుర్యం పొందగలదని నిర్వాహకులు భావిస్తున్నారు. మార్కెట్‌లు వృద్ధి చెందడంతో తగిన గృహాలకు డిమాండ్‌,అవసరం పెరుగుతుంది.

అందువల్ల ఈ మూడు రోజుల కార్యక్రమం రాబోయే కాలంలో పరిశ్రమ మరింత
ముందుకు వెళ్లేందుకు తోడ్పడనుంది. ఈ సందర్భంగా శ్రీ పీ రామకృష్ణా రావు, ప్రెసిడెంట్‌, క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌ నగరంలో
రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. గత రెండు సంవత్సరాలు అత్యంత సవాల్‌గా నిలిచాయి.ఐటీ/ఐటీఈఎస్‌ రంగాలకు అతి ప్రధానమైన కేంద్రంగా హైదరాబాద్‌ నిలుస్తుంది. ఇక్కడ అపారమైన ప్రతిభావంతులు, వేగవంతంగా మారుతున్న సంస్కృతి ఉండటంతో నగరాన్ని తమ ఇంటిగా ఎంతోమంది మలుచుకుంటున్నారు. వీటితో పాటుగా స్థిరమైన, చురుకైన ప్రభుత్వం వినూత్నమైన పాలసీలు అయినటువంటి టీఎస్‌–ఐపాస్‌,ముందుచూపున్న పారిశ్రామిక విధానం తీసుకువచ్చింది. ఇవి పలు భారీ కంపెనీలు తమ అంతర్జాతీయ కంపెనీలను
ప్రారంభించేందుకు తోడ్పడటంతో పాటుగా నగరంలో తమ పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాయి.

ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడుతున్న వ్యక్తుల సరాసరి వయసు 35 సంవత్సరాలుగా ఉంది. గత కొద్ది దశాబ్దాలలో కనిపించిన ధోరణితో పోలిస్తే ఇది స్వల్పంగానే ఉంది.గతంలో ఈ సరాసరి వయసు 50 సంవత్సరాలుగా ఉండేది. అపార్ట్‌మెంట్‌ల కోసం డిమాండ్‌ నెమ్మదిగా పెరుగుతుంది. మహమ్మారి కారణంగా హైబ్రిడ్‌ పని సంస్కృతి పెరిగింది. దీనితో పాటుగా రికార్డు స్ధాయిలో అతి తక్కువ వడ్డీరేట్లును గృహ ఋణాలకు అందిస్తుండటంతో పాటుగా స్థిరమైన రియల్‌ ఎస్టేట్‌ ధరలు కూడా లభ్యతను పెంచుతున్నాయి. కొనుగోలుదారులకు మరింత సౌకర్యం అందించేందుకు మేము క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022ను ఏప్రిల్‌ 29 నుంచి 01 మే 2022 వరకూ హైటెక్స్‌ వద్ద నిర్వహించనున్నారు. తద్వారా గృహ కొనుగోలు దారులు అత్యుత్తమ టీఎస్‌–రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులను నగరంలో ఒకే చోట అందించగలరు’’ అని అన్నారు.

శ్రీ వీ రాజశేఖర్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీ, క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యతా కేంద్రంగా హైదరాబాద్‌ నిలుస్తుంది. మరీ ముఖ్యంగా భారీ ఎంఎన్‌సీలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనికి తోడు ప్రకాశవంతమైన, వేగంగా వృద్ధి
చెందుతున్న స్థానిక వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ ఈ వృద్ధికి తోడ్పాటునందించ డంతో పాటుగా నగరంలో ఉపాధి కల్పన కూడా చేస్తుంది. ప్రభుత్వం,చురుకైన, పరిశ్రమ అనుకూల విధానాలు కారణంగా భారీ కార్పోరేట్‌ సంస్థలైన యాపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, ఇన్ఫోసిస్‌, గుగూల్‌, టీసీఎస్‌, డెలాయిట్‌, ఐబీఎం ,మరెన్నో సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసుకుం టున్నాయి. సమీప భవిష్యత్‌లో ఈ నగరంలో 3 డాటా సెంటర్లు రానున్నాయి. దాదాపు 20,761 కోట్ల రూపాయల పెట్టుబడులను అమెజాన్‌డాటా సర్వీసెస్‌ , నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) ఓ స్మార్ట్‌ డాటా సెంటర్‌ను ; గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ చేత గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీసెస్‌ సెంటర్‌ అలాగే 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో నగరంలో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను పెట్టడంతో పాటుగా 1000 ఉద్యోగాలను సృష్టించనుంది.

వీటితో పాటుగా సైబర్‌ సెక్యూరిటీ లక్ష్యిత సంస్థలైన కొటెల్లిజెంట్‌– టెక్‌ డెమోక్రసీ కంపెనీ సైతం నూతన సైబర్‌ వారియర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను 1000 మంది సైబర్‌ వారియర్స్‌ను హైదరాబాద్‌ నుంచి శిక్షణ అందించడం కోసం ఎంచుకోనుంది. అలాగే నగరంలో ఫార్మాసిటీ, జినోమ్‌ వ్యాలీ వద్ద ఫార్మాస్యూటికల్స్‌, హెల్త్‌కేర్‌ కంపెనీలు రానున్నాయి. అలాగే ఉపాధి అవకాశాలను కల్పించే మరెన్నో కంపెనీలు నగరంలో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఇవన్నీ కూడా హౌసింగ్‌కు డిమాండ్‌ గణనీయంగా పెంచుతుంది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్షోభం నడుస్తున్నప్పటికీ, ముడి పదార్థాల ధరలు పెరిగి ఆస్తుల ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్‌లో ధరలు మాత్రం సహేతుకంగానే ఉన్నాయి. అయితేఇదే రీతిలో ధరలు కొనసాగడం మాత్రం లేదు. త్వరలోనే వీటి ధరలు గణనీయంగా పెరగనున్నాయి. అందువల్ల సంభావ్య గృహ కొనుగోలుదారులు ప్రస్తుత తక్కువ ధరలను సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా తమ మనసుకు నచ్చిన గృహాలను కొనుగోలు చేయవచ్చు. అత్యంత విశ్వసనీయమైన క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022 కేవలం టీఎస్‌ రెరా నమోదిత ప్రాజెక్టులను సభ్య డెవలపర్ల నుంచి నిర్వహిస్తోంది. ఈ ప్రోపర్టీ షో 29 ఏప్రిల్‌,1 మే 2022 వద్ద నిర్వహించనున్నాం’’ అని అన్నారు.

error: Content is protected !!