365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,జనవరి 22,2025: సుస్థిరత, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలపట్ల తన నిబద్ధతను మరింత బలపరిచేలా, CRI (సీఆర్ఐ) పంప్స్ కీలకమైన విజయాన్ని సాధించింది.

మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL), ముంబయి, CRI (సీఆర్ఐ) పంప్స్‌ను అధికారికంగా ఎంప్యానెల్ చేసి, “మగేల్ త్యాలా సౌర్ కృషి పంప్ (MTSKP)” పథకం కింద Rs. 754 కోట్ల విలువైన 25,000 సోలార్ పంపింగ్ సిస్టమ్స్ సరఫరా చేయడానికి ఆర్డర్ ఇచ్చింది.

ఈ అవకాశం ద్వారా, మహారాష్ట్ర వ్యవసాయరంగాన్ని పునరుత్పాదక ఇంధన పరిష్కారాలతో మరింత శక్తివంతం చేయడంతో పాటు, పచ్చదనం కలిగిన స్థిరమైన భవిష్యత్తుకు CRI కీలకమైన పాత్ర పోషించనుంది.

ఈ విజయంపై CRI గ్రూప్ చైర్మన్ జి. సౌందరరాజన్ మాట్లాడుతూ, “MSEDCL మమ్మల్ని సోలార్ పంపింగ్ సిస్టమ్స్ సరఫరా కోసం ఎంపిక చేయడం మా గర్వకారణం. ఈ ఆర్డర్ CRI పరిక్షితమైన సాంకేతికత, ఇంధన సామర్థ్యానికి సంబంధించి మన ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. మా నైపుణ్యం, శ్రేణి విస్తరణ సామర్థ్యాలతో, సకాలంలో సరఫరా ,ఇన్‌స్టాలేషన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.

పునరుత్పాదక ఇంధన వైపు ప్రపంచం మరింత చైతన్యవంతంగా మారుతున్న ఈ సమయంలో, పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా మా సోలార్ పంపింగ్ పరిష్కారాలను అందించడంలో మేము అంకితభావంతో ఉన్నాం” అని తెలిపారు.

ఇప్పటివరకు 1,70,000 పైగా సోలార్ పంపింగ్ సిస్టమ్స్ , IoT ఆధారిత స్మార్ట్ పంపులను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసిన CRI పంప్స్, సాంకేతిక ఆవిష్కరణలలో కొత్త ప్రమాణాలను స్థాపించింది.

కంపెనీ అభివృద్ధిపరిచిన ఆధునిక పంపింగ్ సాంకేతికతల ద్వారా సుమారు 5,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు, 4.13 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి అనేక విజయాలు సాధించి, పర్యావరణ సుస్థిరతకు గణనీయమైన మద్దతునందిస్తోంది.

ఈ పురోగతితో, CRI (సీఆర్ఐ) పంప్స్ పునరుత్పాదక ఇంధన పరిష్కారాల్లో తన అగ్రగామిత్వాన్ని మరింత బలపరుస్తోంది.