365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్, న్యూస్ ఇండియా,మర్చి 4,2022: లక్షలాది మంది డిజిటల్ అవగాహన ఉన్న భారతీయులు క్రిప్టో అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అన్వేషణ చేస్తున్నారు, ఇందుకోసం వారు ఇతర దేశాల్లో తమ సమకాలీనుల అనుభవాలు, అభిప్రాయాల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో పరిశ్రమ నిపుణులు, అనుభవజ్ఞులతో సహేతుకమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు భారతీయ రెగ్యులేటర్లు కృషి చేస్తున్నారు.
క్రిప్టోలు అంటే బ్లాక్‌చైన్ ద్వారా నిర్వహించబడే డీసెంట్రలైజ్డ్ డిజిటల్ అసెట్స్. సరళంగా చెప్పాలంటే, కంపెనీలకు స్టాక్స్ ఎలాగో, బ్లాక్‌చైన్‌కు ఈ అసెట్స్ అలాంటివి. మార్కెట్ ఓ కంపెనీకి ఇచ్చే విలువను స్టాక్ ధర ప్రతిబింబిస్తుంది. క్రిప్టో అసెట్ ధర సంబంధిత బ్లాక్‌చైన్ టెక్నాలజీకి చెందిన వ్యాపార సామర్ధ్యాన్ని ప్రతిబింబిస్తుంది లేదా మార్కెట్ ఆశిస్తున్న లాభాలను సూచిస్తుంది.
ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నా సరే, ఈ ఆకర్షణీయమైన అసెట్ క్లాస్… నవంబర్ 2021లో ఆల్ టైం గరిష్ట స్థాయిలో ₹223 కోట్లకు (3 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన క్రిప్టో అసెట్ అయిన బిట్‌కాయిన్ ధర, జనవరి 2021లో పలికిన ₹20.8 లక్షల (28,000 డాలర్లు) నుంచి, కేవలం 11 నెలల కాలంలోనే ₹50.5 లక్షల (68,000 డాలర్లు)కు చేరుకుంది. ఎథీరియం, షిబా ఐను,సొలానా వంటి ఇతర క్రిప్టో అసెట్స్ విలువ కూడా ఇదే విధంగా మార్పు సంతరించుకున్నాయి.
భారతీయులు దీనిని గమనించి, మార్కెట్ రీసెర్చ్ ఫరమ్ చైనాలిసిస్ ప్రకారం, ₹446.5 కోట్ల (6 బిలియన్ డాలర్లు)ను వివిధ క్రిప్టో అసెట్స్‌లో పెట్టుబడి చేయడంతో, క్రిప్టోను స్వీకరిస్తున్న ప్రమాణాల ప్రకారం, ఇండియాను రెండవ అతి పెద్ద దేశంగా నిలిపారు.
కానీ సంప్రదాయ పెట్టుబడి ఆస్తులతో పోల్చితే క్రిప్టోలు ఎంతో ఒడిదుడుకులకు గురవుతాయి. అతి పాతదైన క్రిప్టో బిట్‌కాయిన్‌ను ఉదాహరణగా తీసుకుంటే, దీనికి అనేక అధిక, అల్ప స్థాయిలు ఉన్నాయి. 2014లో, బిట్‌కాయిన్ ధర 86 శాతం క్షీణించి ₹14,886 (200 డాలర్లు)కు పడిపోయింది. 2017లో, ఇది అప్పటి ఆల్‌టైం గరిష్ట స్థాయి ₹14.6 లక్షల (19,700 డాలర్లు)కు చేరుకుంది. 2018లో, ఇది కోలుకునేందుకు ముందు, ₹2.6 లక్షల (3,500 డాలర్లు) కిందకు పడిపోయింది. 2020లో, బిట్‌కాయిన్ తన మార్కెట్ విలువలో 50 శాతం కోల్పోయింది,ఏప్రిల్ 2021లో, ఇది తిరిగి ఆల్‌టైం గరిష్ట స్థాయి ₹48.2 లక్షలు (64,800 డాలర్లు)కు చేరుకుంది.
ఈ అసెట్ క్లాస్‌తో ప్రయోగం చేయాలని ఆలోచన ఉన్న వారు, క్రిప్టో అసెట్స్ ఫండమెంటల్స్, శక్తి సామర్ధ్యాలను అంచనా వేయడానికి, తమ సొంత పరిశోధన చేయాలి. లాంగ్-టెర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అంచనా అంటే, సహజంగా కనీసం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు అసెట్‌ను హోల్డ్ చేయాల్సి ఉంటుంది, లేదా షార్ట్-టెర్మ్ వ్యూహం తగినట్లుగా ఉంటుంది. ఒకరి పెట్టుబడి వ్యూహం ఆమె లేదా అతని సొంత రిస్క్ సామర్ధ్యం ఆధారంగా ఉంటుంది, ఆర్థిక పోర్ట్‌ఫోలియో: ఎమర్జెన్సీ ఫండ్, జీవిత,వైద్య కవర్, క్రమశిక్షణతో చేసే గోల్ ఆధారిత పెట్టుబడి, పొదుపు.. వీటి అన్నిటి ఫండమెంటల్స్‌ను కవర్ చేస్తుంది.
ఇన్వెస్ట్ చేయడంలో ప్రధాన నిబంధన ఏమిటంటే, “మీరు నష్టపోయేందుకు భరించగల మొత్తాన్ని పెట్టుబడి చేయండి,” ఇది క్రిప్టోలకు కూడా వర్తిస్తుంది, ఈ అసెట్ క్లాస్‌ను త్వరగా ధనవంతులు అయ్యే స్కీమ్‌గా అర్థం చేసుకోకూడదు.