365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 3, 2025: ప్రముఖ వ్యవసాయ రసాయన ఉత్పత్తుల కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ (CCPL) దేశవ్యాప్తంగా వరి, పత్తి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు విప్లవాత్మక ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
వరి పంటల్లో కలుపుమొక్కల నివారణ కోసం “రైస్‌యాక్ట్ (RICEACT)”, పత్తిలో రసం పీల్చే తెగుళ్లపై నియంత్రణ కోసం “జివోరా (JIVORA)”ను ఆవిష్కరించారు.
ఉత్సాహవంతమైన వ్యవసాయ రంగ వృద్ధిలో భాగంగా…
భారతదేశ సస్యరక్షణ మార్కెట్ 2025 నాటికి సుమారు USD 2.59 బిలియన్లుగా ఉండగా, 2030 నాటికి ఇది USD 3.21 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ ప్రణాళికాత్మక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని, క్రిస్టల్ ఈ రెండు కొత్త ఉత్పత్తులతో తన మార్కెట్ వాటాను పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

రైస్‌యాక్ట్ – వరి సాగుకు వినూత్న కలుపు నివారణ పరిష్కారం
రైస్‌యాక్ట్ అనేది ‘ఎర్లీ పోస్ట్-ఎమర్జెన్స్’ కలుపుమొక్కల నివారణకు రూపొందించిన శక్తివంతమైన హెర్బిసైడ్. ఇందులో రెండు ప్రభావవంతమైన క్రియాశీల పదార్థాలు – ట్రయాఫమోన్ (20%), ఇథాక్సిసల్ఫ్యూరాన్ (10%) కలబోతగా ఉన్నాయి. ఇవి కలుపుమొక్కలను వేళ్ళ ద్వారా, ఆకుల ద్వారా నియంత్రించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ఈ హెర్బిసైడ్ ద్వారా పల్లె నుంచి నాట్ల వరి వరకు విస్తృతంగా ఉపయోగించవచ్చు.
ఇది గడ్డి, తుంగ,వెడల్పాటి ఆకుల కలుపులను సమర్థవంతంగా నిర్మూలించగలదు.
రైస్‌యాక్ట్‌ను “1–3 ఆకుల దశలో”,”8–12 DAT/DAS” మధ్య ఉపయోగించవచ్చు.
ఎకరాకు 90 గ్రాముల మోతాదులో ఇది పూర్తిసీజన్ కలుపు నియంత్రణ అందిస్తుంది.
ఈ కొత్త పరిష్కారం ప్రారంభ దశలోనే సుమారు 3 లక్షల ఎకరాల వరి భూమిలో ప్రయోజనం చేకూర్చనుందని కంపెనీ అంచనా వేస్తోంది.
జివోరా – పత్తిలో రసం పీల్చే తెగుళ్లపై అద్భుత నియంత్రణ
జివోరా అనేది రెండు నైపుణ్యమైన క్రియాశీల పదార్థాలతో రూపొందించిన పురుగుమందిగా, ఇది కాంటాక్ట్, సిస్టమిక్ ,ట్రాన్స్‌లామినార్ చర్యలను కలిగి ఉంది. తెల్లదోమలు, జాసిడ్‌లు, అఫిడ్స్ వంటి తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించగలదు.
ముఖ్యంగా 2వ,3వ స్ప్రే దశలలో దీర్ఘకాలిక నియంత్రణ అందిస్తుంది.
జివోరా మొదటి ఏడాదిలోనే సుమారు 5 లక్షల ఎకరాల పత్తి పంటను కవర్ చేయనుంది.
దీని ద్వంద్వ చర్య విధానం మొక్కల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది.

కంపెనీ అభిప్రాయాలు
అంకుర్ అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ –
“భారత వ్యవసాయాన్ని ఆధునికత వైపు తీసుకెళ్లే దిశగా మా కృషిలో భాగంగా, రైస్‌యాక్ట్, జివోరాలను రైతులకు అందిస్తున్నాం. ఈ ఉత్పత్తులు రైతుల పంటలను రక్షిస్తూ, దిగుబడిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.”
సోహిత్ సత్యవాలి, వైస్ ప్రెసిడెంట్ – సేల్స్ & మార్కెటింగ్:
“రైస్‌యాక్ట్ దీర్ఘకాలిక కలుపు నియంత్రణ కోసం రూపుదిద్దుకోగా, జివోరా పత్తి రైతులకు మల్టీ-స్టేజ్ తెగుళ్ల నివారణలో విశ్వసనీయ పరిష్కారంగా నిలుస్తుంది.”
లభ్యత వివరాలు
రైస్‌యాక్ట్: 50g, 100g, 250g, 500g, 1kg ప్యాకేజీలలో
జివోరా: 45g, 60g, 90g ప్యాకేజీలలో
ఈ ఉత్పత్తులు క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ అధీకృత పంపిణీ నెట్‌వర్క్ ద్వారా మార్కెట్‌లో లభ్యమవుతాయి.
ఈ రెండు పరిశోధన-ఆధారిత, రైతు అవసరాలకేర్చిన ఉత్పత్తులు భారత వ్యవసాయ రంగంలో కీలక పురోగతిగా నిలుస్తున్నాయి. దేశీయ రైతుల ఆదాయ వృద్ధికి తోడ్పడుతూ, వ్యవసాయ ఉత్పాదకత పెరిగేలా దోహదపడనున్నాయి.