365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు,మార్చి 16,2022: గృహోపక రణాల డిమాండ్ విషయంలో భారతదేశంలో ని అన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చిన ప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని అమేజాన్ ఇండియా నేడు ప్రకటించింది. అమేజాన్ తమ ఉపకరణాల పోర్ట్ ఫోలియోని విస్తరించింది,ఎల్జీ, శామ్ సంగ్, లాయడ్,ఇంకా ఎన్నో బ్రాండ్స్ కి చెందిన ధరల పాయింట్లలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్,కొత్త ఉత్పత్తుల్ని చేర్చింది.
హైదరాబాద్,సికింద్రాబాద్ ప్రధాన స్థానంలో ఉన్న నగరాలుగా గృహోపకరణాల శ్రేణిలో అదనపు వృద్ధిని పోత్సహిస్తున్నాయి.ఈ ప్రాంతంలో ఎల్జీ, శామ్ సంగ్, లాయడ్ లు ప్రముఖ బ్రాండ్స్ గా అమ్ముడవుతున్నాయి. Amazon.in పై గృహోపకర ణాలు కోసం అన్వేషణలో+40+ ఎం-ఓ-ఎం పెంపుదలని అమేజాన్ ఇండియా గమనించింది. “గత ఒకటి రెండు సంవత్సరాలు నుండి, భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో గృహోపకరణాలలో కొనుగోళ్ల పోకడ ఉన్నత స్థాయిలో ఉందని మేము గమనించాము. వేసవి కాలం ఆరంభమయ్యే సమయంలో, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు ఏసీలు, రిఫ్రిజిరేటర్స్, కూలర్స్,ఇతర ఉత్పత్తుల్ని Amazon.in నుండి కొంటున్నారు.
కస్టమర్స్ నో కాస్ట్ ఈఎంఐ వంటి ఫైనాన్స్ పథకాల్ని ఉపయోగించడం కూడా ఎక్కువైంది,అధిక ధరలు గల బ్రాండ్స్ శ్రేణులు కోసం తక్కువ ధరల్ని ప్రోత్సహించ డానికి చొరవలు ద్వారా అందించే ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ ని కూడా కస్టమర్స్ ఎక్కువగా పొందుతున్నారు. స్మార్ట్ /వై-ఫై సదుపాయం గల ఎయిర్ కండిషనర్స్ఉపయోఘించ డానికి కొత్త కస్టమర్ డిమాండ్ ఆధారంగా అభివృద్ధి చెందడానికి మా ప్రయత్నంలో భాగంగా డిస్కౌంట్ ధరలకి అమేజాన్ ఇకో డాట్ తో సెల్లర్స్ వేర్వేరు ఎన్నో ఆఫర్స్ ని కూడా పరిచయం చేసారు. Amazon.in పై లభించే గృహోపకరణాలు,విస్త్రతమైన ఎంపిక నుండి ఎంచుకునే సమయంలో తమ ఇంటి నుండి సౌకర్యవంతంగా తమకు అవసరమైన అన్నింటినీ కస్టమర్లు తెలుసుకునేలా,వేగంగా, నిర్ణయించిన సమయాని కి ఇంటికి డెలివరీ అందించే ప్రయోజనం పొందడంలో సహాయపడటానికి కూడా మేము కట్టుబడ్డాము”అని అక్షయ్ అహూజా, కాటగిరి లీడర్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అమేజాన్ ఇండియా అన్నారు.
మొత్తం పోకడలు :
గత ఒకటి రెండు సంవత్సరాలు నుండి కస్టమర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన ఏసీ &రిఫ్రిజిరేటర్స్ పరిమాణం 2020కి సంబంధించి 2x చేరుకుంది. ఏసీలు కోసం ఐఎన్ఆర్ 30 వేలు -ఐఎన్ఆర్ 40 వేలు ధరల బ్యాండ్స్ శ్రేణిలో, రిఫ్రిజిరేటర్స్ కోసం ఐఎన్ఆర్ 15 వేలు,ఐఎన్ఆర్ 20 వేలు ప్రధాన స్రవంతి శ్రేణి నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది.
ఈ ప్రాంతంలో అమేజాన్ చూసిన కస్టమర్ల పోకడలు :
1.గృహోపకరణాల శ్రేణిలో కొత్త కస్టమర్ల వృద్ధి గత 6 నెలల్లో +40% కనిపించింది.
2.గృహోపకరణాల శ్రేణిలో బ్రాండెడ్ కీవర్డ్ అన్వేషణల వాటా 20% మెరుగుపరచబడింది.
3.దక్షిణాది ప్రాంతానికి చెందిన కస్టమర్లు శామ్ సంగ్, ఎల్జీ, వరల్ పూల్, హైర్, డైకిన్ &హిటాచీ వంటి బ్రాండ్స్ కి ప్రాధాన్యతనిచ్చారు.
4.కస్టమర్స్ ఎయిర్ కండిషనర్స్ కోసం 30 వేలు – 40 వేలు &రిఫ్రిజిరేటర్స్ కోసం 15 వేలు – 25 వేలు ధరల స్థాయిని అన్వేషిస్తున్నారు.
5.గృహోపకరణాలలో, ఎంపిక కోసం బ్రాండ్ తో పాటు ధరలు,కన్వర్టిబుల్,స్మార్ట్-, ఎనర్జీ రేటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్స్ ప్రాథమిక అంశాలుగా ఉన్నాయి.
6.ఎయిర్ కండిషనర్స్ శ్రేణిలో స్మార్ట్ ఏసీలు వాటా 15% చేరుకుంది ( గత 2 సంవత్సరాలలో 8x వృద్ధి)
7.కన్వర్టిబుల్ & అధిక స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్స్ &రిఫ్రిజిరేటర్స్ కి డిమాండ్ పెరిగింది,అవి అతి వేగంగా పెరుగుతున్న ఉప-విభాగంగా నిలిచాయి.
8.ఎనర్జీ ఎఫీషియెంట్ 4, 5 స్టార్ రేటెడ్ రిఫ్రిజిరేటర్స్ ద్వారా అమ్ముడైన రిఫ్రిజిరేటర్స్ 30%గా నిలిచి విభాగం 2 సంవత్సరాలలో రెట్టింపైంది.