365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 24,2024:మహిళా భద్రత, ర్యాగింగ్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు సైబరాబాద్ పోలీస్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు షీ టీం బృందం విద్యార్థులకు వీడియోలు, పోస్టర్లు, మొబైల్ యాప్ వినియోగం, సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్వీయ రక్షణ విన్యాసాలను మహిళా విద్యార్థులకు ప్రదర్శన ద్వారా అందించడం జరిగింది.
యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా నషాముక్తి భారత్ అభియాన్ లో భాగంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రుద్రమదేవి స్వీయ రక్షణ బృందం ఆధ్వర్యంలో పోకిరీల నుంచి మహిళలలు ఎలా తమంతట తాము ఎదుర్కోవాలో శిక్షణ అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో షీ టీం రాజేంద్రనగర్ బృందం డి ప్రకాష్ రావు, బాలరాజ్, సురేష్, కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్లు, విద్యార్థి వ్యవహారాల ఇంచార్జ్ పాల్గొని యాంటీ ర్యాగింగ్ వారోత్సవాలను ముగించడం జరిగింది.