365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మార్చి26,2024: మాదాపూర్‌లోని ఓ వ్యభిచార గృహంపై సైబరాబాద్ ఎస్‌ఓటీ బృందం సోమవారం రాత్రి దాడి చేసింది.
ఆర్గనైజర్, ఇద్దరు కస్టమర్లు, మేనేజర్‌ని పట్టుకున్న పోలీసులు వారి నుంచి రూ.57,500 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిధి మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తోంది. అరెస్టయిన నిర్వాహకుడు సోషల్ మీడియా వేదికల ద్వారా కస్టమర్లను సంప్రదించి రూ.3000 నుంచి రూ.4000 వరకు వసూలు చేశాడు.
పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలను రక్షించారు.