Cyient Signs MoU with SaaS Provider Decipher to Support the Global Rollout of Key Cloud Mining PlatformCyient Signs MoU with SaaS Provider Decipher to Support the Global Rollout of Key Cloud Mining Platform

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15, 2020 ః అంతర్జాతీయ ఇంజినీరింగ్‌, తయారీ, డిజిటల్‌ పరవర్తన,సాంకేతిక పరిష్కారాల కంపెనీ, సైయెంట్‌ నేడు పెర్త్‌ కేంద్రంగా కలిగిన డిసిఫర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. టైలింగ్‌ స్టోరేజీ సదుపాయాల కోసం క్లౌడ్‌  పర్యవేక్షణ ,పరిపాలన వేదికను డిసిఫర్‌ అందిస్తుంది. ఈ ఎంఓయులో భాగంగా సైయెంట్‌ ఇప్పుడు డిసిఫర్‌కు తమ క్లౌడ్‌ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో టైలింగ్స్‌,పునరావాస పర్యవేక్షణతో మద్దతునందించనుంది.టైలింగ్స్‌ అంటే మినరల్‌ వ్యర్ధాలు. ముడి ఖనిజ ప్రాసెసింగ్‌ తరువాత మినరల్‌ సాంద్రతలను ఒడిసిపట్టే క్రమంలో ఇవి ఉద్భవిస్తాయి,వీటిని ఇంజినీర్డ్‌ కంటెయిన్‌మెంట్‌ నిర్మాణంలో భద్రపరుస్తారు. దీనినే టైలింగ్‌ స్టోరేజీసదుపాయం (టీఎస్‌ఎఫ్‌) అంటారు. అంతర్జాతీయంగా 3500 యాక్టివ్‌ టీఎస్‌ఎఫ్‌ లు ఉన్నాయని అంచనా. ఇవి దాదాపు ఒక మిలియన్‌ హెక్టార్ల భూమిని ఆక్రమించాయి,వీటిలో చాలా వరకూ పనికిరానటువంటివి లేదా వదిలివేయడమూ జరిగింది.టైలింగ్‌ స్టోరేజీ సదుపాయాలు విఫలం కావడం వల్ల అనియంత్రితంగా నీరు, వ్యర్థపదార్ధాలు లేదా పర్యావరణానికి హాని కలిగించే విషపదార్థాలూ విడుదల కావొచ్చు. క్లౌడ్‌ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో, మైనింగ్‌ కంపెనీలు ఇప్పుడు మాన్యువల్‌ ప్రక్రియలను భర్తీ చేయడంతో పాటుగా అపరిపక్వ సమాచారాన్ని మరింత స్పష్టమైన , సురక్షిత క్లౌడ్‌ వేదిక ద్వారా భర్తీ చేయవచ్చు. ఇది అత్యాధునిక పరిశ్రమ ప్రక్రియలకు కట్టుబడి ఉండటంతో పాటుగా నిర్ధారిత ప్రమాణాలనూ అనుసరిస్తాయి. సైయెంట్,దాని అనుబంధ సంస్థలు, ఐజీ భాగస్వాములు విక్రయాలు , అమలులో ప్రతిష్టాత్మక పాత్రను పోషించడంతో పాటుగా ముందుకు వెళ్లే కొద్దీ ఈ పరిష్కారాలకు మద్దతునందిస్తుంది.

Cyient Signs MoU with SaaS Provider Decipher to Support the Global Rollout of Key Cloud Mining Platform
Cyient Signs MoU with SaaS Provider Decipher to Support the Global Rollout of Key Cloud Mining Platform

ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలను గురించి  హెర్మాన్‌ క్లీన్హాన్స్‌, సెక్టార్‌ హెడ్‌– మైనింగ్‌, సైయెంట్‌ మాట్లాడుతూ ‘‘డిసిఫర్‌, సంపూర్ణమైన పరిష్కారాలు , టీఎస్‌ఎఫ్‌ పర్యవేక్షణ మరియు పరిపాలనకు సంబంధించి లోతైన అవగాహనతో సైయెంట్‌ సాంకేతికత, అంతర్జాతీయ చేరిక మిళితమై మా మైనింగ్‌ ఖాతాదారులకు అసాధారణ ప్రయోజనం తీసుకువస్తుంది. ఈ భాగస్వామ్యం సానుకూల పర్యావరణ ప్రభావం తీసుకురావడంతో పాటుగా అంతర్జాతీయంగా మైనింగ్‌ కార్యకలాపాలలో ఉన్న ప్రజల భద్రత పరంగా కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది’’ అని అన్నారు.డిసిఫర్‌ సీఈవో , ఆంథోనీ వాకర్‌ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయంగా అగ్రగామి సైయెంట్‌ అనుభవం ,చేరిక, అంతర్జాతీయంగా మా వినియోగదారులకు మెరుగైన పరిష్కారాలను అందించడంలో మాకు మద్దతునందిస్తుంది. పరిశ్రమను సవాలు చేయడంలో,నడిపించడంలో అంతర్జాతీయ పరిశ్రమ టైలింగ్స్‌ ప్రమాణాలు తీసుకున్న గొప్ప ప్రగతికి డిసిఫర్‌ అందిస్తున్న మద్దతు,వ్యవస్ధల అవసరం ఉంది. సైయెంట్,దాని అనుబంధ సంస్థ ఐజీ పార్టనర్స్‌ ఇప్పుడు మాతో చేతులు కలుపడంతో పాటుగా ఈ భాగస్వామ్యంను విజయవంతం చేయనుండటం పట్ల సంతోషంగా  ఉన్నాము’’ అని అన్నారు.