365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 12,2025: కథలో బలం, దర్శకుడు బాబీ కొల్లి కథను ఎమోషన్‌తో సమర్థంగా నడిపించాడు. బాలకృష్ణ డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లుగా చేయడం సినిమా విజయానికి హైలైట్‌గా మారింది.

సినిమా మొత్తం ఒక ఎమోషనల్ డ్రామాగా సాగిపోతుంది. బాబీ తన స్క్రీన్ ప్లే ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించాడు. కథనం ఎక్కడా అసహనం కలిగించకుండా ఆసక్తిగా ముందుకు తీసుకెళ్లాడు.

మహిళలకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. అయితే టైటిల్ కొంతవరకు వారిని థియేటర్‌కి రావడానికి అడ్డుగా మారుతుందనే అభిప్రాయం ఉంది.

పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్
సినిమాలో పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మరింత బలం చేకూర్చింది.

ఊర్వశి రౌటేల పాడిన స్పెషల్ సాంగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆ పాట ప్రేక్షకులకు విశేషంగా నచ్చుతుంది.

బాలయ్య సంక్రాంతి విజయాన్ని అందుకున్నాడు!

సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య మరోసారి తనదైన శైలిలో గెలిచాడు. ఫ్యాన్స్‌కి పండగ వాతావరణాన్ని కలిగించాడు.

మొత్తానికి, డాకు మహారాజ్ బాలయ్యకు మరో విజయం తీసుకొచ్చిన సినిమా ఇది.

రేటింగ్: 3.5/5