365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఏప్రిల్ 19,2023:NCLT ముంబై రిలయన్స్ క్యాపిటల్ రిజల్యూషన్ ప్రక్రియ కోసం గడువును 90 రోజుల పాటు జూలై 16 వరకు పొడిగించింది. ప్రస్తుత గడువు ఏప్రిల్ 14తో ముగిసింది.
రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం నుంచి గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలు ఏప్రిల్ 26న రెండవ రౌండ్ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నందున గడువు పొడిగింకదం జరిగింది.
ముగ్గురు బిడ్డర్లు, అంటే టోరెంట్, IIHL ,Oaktree వేలంలో తమ భాగస్వామ్యా న్ని ధృవీకరించారు.
ముందుగా రెండో రౌండ్ వేలం ఏప్రిల్ 11న జరగాల్సి ఉండగా, బిడ్డర్లు లేవనెత్తిన సమస్యలను క్రమబద్ధీకరించేందుకు రుణదాతలకు సమయం అవసరం కావడంతో ఏప్రిల్ 26కి వాయిదా పడింది.

ఐబిసి,ఆర్‌ఎఫ్‌ఆర్‌పికి అనుగుణంగా రిజల్యూషన్ ప్లాన్ ఉందని నిర్ధారించుకో వాలని బిడ్డర్లు రిలయన్స్ క్యాపిటల్‌ను కోరారు.
రెండవ రౌండ్ వేలం పూర్తయిన తర్వాత తదుపరి చర్చలు జరగవని ,రెండవ రౌండ్ ముగిసిన తర్వాత పరిష్కార ప్రక్రియను ఖరారు చేస్తామని బిడ్డర్లు రుణదాతల నుంచి హామీని కూడా కోరుతున్నారు.