Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,నేషనల్,డిసెంబర్ 26,2021: దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న‌- జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి (డిఎవై-ఎన్ ఆర్ ఎల్ ఎం) మిష‌న్, 75 సంవ‌త్స‌రాల స్వాతంత్ర ఉత్స‌వాలైన ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఈవెంట్‌ను 2021 డిసెంబ‌ర్ 18న వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వ‌హించింది.  గ్రామీణ ఆర్థిక సేవ‌లు అంద‌రికీ అందుబాటుపై చ‌ర్చ‌ను ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించింది. బ్యాంకుల ఎక్సిక్యుటివ్ డైర‌క్ట‌ర్లు, ఛీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు,  బ్యాంకుల ఇత‌ర సీనియ‌ర్ అధికారులు,
 రాష్ట్రాల గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్‌ల‌కు చెందిన ఎక్జిక్యుటివ్ అధికారులు, స్టేట్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన  గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్  సంయుక్త కార్య‌ద‌ర్శి చర‌ణ్‌జిత్ సింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారికి స్వాగ‌తం ప‌లికారు. భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన గ్రామీణాభివృద్ది విభాగ కార్య‌ద‌ర్వి శ్రీ నాగేంద్ర నాత్ సిన్హ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా, డిఎవై- ఎన్ ఆర్ ఎల్  ఎం కింద‌, ప్ర‌ధాన‌మంత్రి న్ ధ‌న్ యోజ‌న ఖాతాను బ్యాంకులో క‌లిగిన త‌గిన ప‌రిశీల‌న చేసిన స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యుల‌కు 5 వేల రూపాయ‌లు ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయం క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి నాగేంద్ర నాథ్ సిన్హా ప్రారంభించారు.  కేంద్ర ఆర్ధిక మంత్రి 2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా దీనిని ప్రారంభించారు. రాజ‌స్థాన్‌, జార్ఖండ్ , ఉత్త‌ర ప్ర‌దేశ్ మూడు రాష్ట్రాల‌నుంచి ఒక్కో రాష్ట్రంత‌ర‌ఫున ఆరుగు మ‌హిళా స్వ‌యం స‌హాయ బృందాల స‌భ్యుల‌కు ఈ ప‌థ‌కం ప్రారంభ సూచ‌న‌గా రూ 5000 వంతున అంద‌జేశార‌రు. దీన‌ని బ్యాంకుల సీనియ‌ర్ అధికారులు,రాష్ట్ర గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్ ఛీఫ్ ఎగ్జిక్యుటివ్ అధికారుల‌, సీనియ‌ర్ అల‌ధికారుల స‌మ‌క్షంలో ఆయా రాష్ట్రాల కేంద్ర కార్యాల‌యాల‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో అంద‌జేశారు. డిఎవై- ఎన్ ఆర్ ఎల్ ఎం కింద 5 కోట్ల మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క‌ స‌భ్యులు ఈ స‌దుపాయం ద్వారా ప్ర‌యోజ‌నం పొందుతారని అంచ‌నా..

ఈ ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయాన్ని ప్రారంభించిన త‌ర్వాత , గ్రామీణ ఆర్దిక వ్య‌వ‌స్థ పున‌రుద్ధ‌ర‌ణ‌పై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన గ్రామీణ జీవ‌నోపాథికి చెందిన సంయుక్త కార్య‌ద‌ర్శి నీతా కేజ్రివాల్  ఒక ప్రెజెంటేష‌న్ ను ఇచ్చారు. మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వివిధ కార్య‌క్ర‌మాల‌తో బ్యాంకులు త‌మ రుణ ఉత్ప‌త్తుల‌ను అనుసంధానం చేయాల్సిందిగా ఆమె కోరారు. గ్రామీణ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో ప‌రివర్త‌న తెచ్చేందుకు స‌హాయ‌ప‌డే దిశ‌గా , గ్రామీణ ప్ర‌జ‌ల‌కు రుణ‌స‌దుపాయం అందించేందుకు తోడ్ప‌డ‌వ‌ల‌సిందిగా బ్యాంకుల‌ను కోరారు.

ఈ స‌మావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వ‌సుధా భ‌ట్ కుమార్ , గ్రామీణ ఆర్ధ‌ఙ‌క వ్య‌వ‌స్థ పున‌రుద్ధ‌ర‌ణ‌లో మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల పాత్ర‌పై మాట్లాడారు.  భీహార్ రాష్ట్ర గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్ జీవిక డిప్యూటీ ఛీఫ్ ఎక్సిక్యుటివ్ ఆఫీస‌ర్ శ్రీ‌ డి. బాల‌మురుగ‌న్ , సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఎక్సిక్యుటివ్ డైర‌క్ట‌ర్ రాజీవ్ పూరి , గ్రామీణప్ర‌జ‌ల‌కు ఆర్థిక విజ్ఞానం అందించ‌డంలో స‌వాళ్లు, ఈ విష‌యంలో భ‌విష్య‌త్ మార్గం పై మాట్లాడారు. అస్సాం రాష్ట్ర గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్ రాష్ట్ర డైర‌క్ట‌ర్ శ్రీ‌మ‌తి కృష్ణ బారువా త‌మ ప్ర‌సంగం సంద‌ర్భంగా , క్లిష్ట ప్రాంతాల‌లో ఆర్దిక తోడ్పాటు- ఈశాన్య ప్రాంతాలు అనే అంశంపై ఒక ప‌వర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. ఈశాన్య ప్రాంతంలోని గ్రామీణ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న వివిధ అంశాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. వివిధ బ్యాంకులు, రాష్ట్ర జీవ‌నోపాధి మిష‌న్‌ల‌కు సంబంధించిన వారు సుమారు 75 ప్రాంతాల నుంచి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

 2020-21 సంవ‌త్స‌రానికి సంబంధించి  ఎస్‌.హెచ్‌.జి బ్యాంక్ లింకేజ్ కార్య‌క్ర‌మం కింద బ్యాంకుల‌కు వార్షిక అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ఈ కింది బ్యాంకుల‌కు అవార్డులు ల‌భించాయి.అవి :
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌
ఇండియ‌న్ బ్యాంక్‌
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అవార్డులు గెలుపొందిన బ్యాంకుల‌న్నింటినీ సంయుక్త కార్య‌ద‌ర్శి నీతా కేజ్రివాల్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో చురుకుగా పాల్గొని ప‌లు అంశాలు చ‌ర్చించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు

error: Content is protected !!