Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 6,2023:భారత స్టాక్ మార్కెట్ సూచీలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వరుసగా సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. బుధవారమూ బెంచ్‌మార్క్ సూచీలు ఆల్‌టైమ్ హైలోనే ముగిశాయి.

నిఫ్టీ 79, సెన్సె్క్స్ 357 పాయింట్ల మేర పెరిగాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. దేశ, విదేశీ సంస్థాగత మదుపర్లు పోటీపడి మరీ షేర్లను కొంటున్నారు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న వార్తలు మార్కెట్లో మూమెంటమ్ తీసుకొచ్చాయి. మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అదరగొట్టాయి.

క్రితం సెషన్లో 69,296 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 69,534 వద్ద మొదలైంది. మధ్యాహ్నం వరకు రేంజుబౌండ్లో కొనసాగిన సూచీ 69,395 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

ఆపై పుంజుకొని 69,744 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 357 పాయింట్ల లాభంతో 69,653 వద్ద ముగిసింది. బుధవారం 20,950 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,852 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది.

కొనుగోళ్ల మద్దతుతో 20,961 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మొత్తంగా 82 పాయింట్ల లాభంతో 20,937 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 177 పాయింట్లు పెరిగి 46,834 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 29 కంపెనీలు లాభపడగా 21 నష్టపోయాయి. విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఐటీసీ, ఎల్‌టీ, టీసీఎస్ టాప్ గెయినర్స్‌గా అవతరించాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐచర్ మోటార్స్, సిప్లా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు టాప్ లాసర్స్.

నేడు బ్యాంకు, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్ రంగాల సూచీలు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి.

నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్ గమనిస్తే 20950 వద్ద సపోర్టు, 21110 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప సమయానికి విప్రో, ఇండియా సిమెంట్స్, టాటా కెమికల్స్, లెమన్ ట్రీ, ఫైన్ ఆర్గానిక్స్ షేర్లను కొనొచ్చు. నేడు నిఫ్టీ పెరుగుదలలో ఐటీసీ, ఎల్‌టీ, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ కీలకంగా నిలిచాయి.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లు 8 శాతం పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 17.8 లక్షల షేర్లు చేతులు మారాయి. జైడస్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన మిథైలిన్ బ్లూ ఇంజెక్షన్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి లభించింది.

ప్రతాప్ స్నాక్స్‌లో మలబార్ ఇండియా 2.16 శాతం వాటాను అమ్మనుంది. బర్జర్ పెయింట్స్‌లో పెద్ద ట్రేడ్ జరిగింది. రూ.581 చొప్పున 29.9 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో హీరోమోట కార్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.2464 చొప్పున రిలయన్స్‌లో 12.7 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!