365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 29,2023:భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. నిన్నటి భారీ నష్టాలను కొంతమేర పూడ్చాయి. క్రూడాయిల్ ఫ్యూచర్స్ తగ్గడం ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంటుకు దారితీసింది.
పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం ఇండియన్ ఎకానమీపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.
హాంకాంగ్, కొరియా, తైవాన్, చైనా, న్యూజిలాండ్, జపాన్ మార్కెట్లు పెరిగాయి. ఎన్‌విడియా వంటి టెక్ కంపెనీల షేర్లు పెరగడంతో అమెరికా మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 114, బీఎస్‌ఈ సెన్సెక్స్ 320 పాయింట్ల మేర లాభపడ్డాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 83.04 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్లో 65,743 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,508 వద్ద మొదలైంది. 65,570 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
చివరికి 320 పాయింట్లు పెరిగి 65,828 వద్ద ముగిసింది. శుక్రవారం వద్ద మొదలైన 19,581 ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,551 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,726 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 114 పాయింట్లు ఎగిసి 19,638 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ బ్యాంక్ 283 పాయింట్ల లాభంతో 44,584 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 38:12గా ఉంది. హిందాల్కో (5.60%), ఎన్టీపీసీ (3.78%), డాక్టర్ రెడ్డీస్ (2.97%), హీరో మోటో (2.85%), టాటా మోటార్స్ (2.75%) టాప్ గెయినర్స్.
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (2.39%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (1.14%), ఇన్ఫీ (0.68%), హెచ్‌సీఎల్ టెక్ (0.39%), నెస్లే ఇండియా (0.38%) టాప్ లాసర్స్. నేడు ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
నిఫ్టీ పెరగడంలో ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, హిందాల్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ కీలకంగా నిలిచాయి. నిఫ్టీ అక్టోబర్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,800 వద్ద రెసిస్టెన్సీ, 19,680 వద్ద సపోర్ట్ ఉన్నాయి.
ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో టొరెంట్ ఫార్మా, సువెన్ ఫార్మా, ఎల్‌టీ ఫైనాన్స్, సన్ ఫార్మా, సోలార్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేయొచ్చు. యూనియన్ బ్యాంకులో నేడు 12.5 లక్షల షేర్లు చేతులు మారాయి. కొనుగోలు చేసిందెవరో ఇంకా తెలియలేదు.
గ్రిడ్‌కో నుంచి విద్యుత్ సరఫరా ఒప్పందం జరగడంతో ఎన్‌ఎల్‌సీ ఇండియా షేర్లు ఆరు శాతం ఎగిశాయి. జొమాటోలో 10 లక్షలు, పిరామల్ ఫార్మాలో 10.3 లక్షల షేర్లు చేతులు మారాయి. గుజరాత్ స్టేట్ ఆర్‌టీసీ నుంచి 1283 బస్సుల కోసం అశోక్ లేలాండ్‌కు ఆర్డర్ లభించింది.
ఎన్టీపీసీ రెన్యూవబుల్స్ నుంచి స్టెర్లింగ్ అండ్ విల్సన్‌కు రూ.1535 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చింది. పాకెట్ ఏసెస్ పిక్చర్స్‌లో 52 శాతం వాటా కొనుగోలుతో సరిగమ ఇండియా షేర్లు 7 శాతం పెరిగాయి. ఎంఎంఆర్డీఏ నుంచి మెగా ఆర్డర్ రావడంతో ఎల్‌టీ షేర్లు ఆల్‌టైమ్ హైను చేరుకున్నాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709