Sun. Dec 22nd, 2024
AP_MEDICAL

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏలూరు,డిసెంబర్ 28, 2022: ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తికర స్థాయిలో ప్రజలకు వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వైద్యాధికారులను ఆదేశించారు.

ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, వైద్య శాఖాధికారులతో కలిసి ఆసుపత్రిలోని ఓ .పి ., కేంద్రాల నుంచి వివిధ విభాగాలు, చికిత్స వార్డులు, టాయిలెట్లను పరిశీలించారు. రోగులను కలిసి వారికి అందుతున్న చికిత్సలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలకు మంచి వైద్య సేవలందించిన చరిత్ర ఉందన్నారు. ఏలూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలగా మార్పు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రసూతి, పిల్లల చికిత్స స్పెషలిస్ట్స్, రేడియోలజిస్ట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలందించడంలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

తల్లి,బిడ్డల వార్డులలో ఎటువంటి వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, స్కానింగ్ నిమిత్తం ప్రైవేట్ రేడియోలజిస్ట్ లను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

AP_MEDICAL

మెడికల్ కాలేజీ మార్పు చేసే క్రమంలో ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్మాణ పనులను కృష్ణబాబు అధికారులతో కలిసి పరిశీలించారు.

ఆసుపత్రిలో కోవిడ్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారా, సిబ్బందిని నియమించరా, ఐ సి యూ బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మెడికల్ కాలేజీ నిర్మాణం సందర్భంగా సంక్షేమ వసతి గృహాల వేరే ప్రదేశంలో నిర్మించే అంశాన్ని, అందుకు తయారుచేసిన ప్రతిపాదనల వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు.

error: Content is protected !!