365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,డిసెంబర్ 16,2022: తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీనేత ఎడవల్లి సుబ్బారావు(62) ఇటీవల చనిపోయారు.
డిసెంబర్ 7వ తేదీ విజయవాడలో జరిగిన జయహో బిసి సదస్సుకు సుబ్బారావు ఎంతో ఉత్సాహంగా హాజరైయ్యారు. అక్కడ స్వల్ప అస్వస్థతకు గురి అవ్వడంతో పార్టీ శ్రేణులు అతనిని అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
వైద్య చికిత్స పూర్తిస్థాయిలో అందించినప్పటికి దురదృష్టవశాత్తు ఆయన కన్నుమూశారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా, తక్షణం ఆయన స్పందించి రూ. 10లక్షలు ఆర్ధిక సాయం పార్టీ తరుపున ప్రకటించారు.
ఈ మొత్తాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నేరుగా పడమర్రు విప్పర్రు వెళ్ళి స్వయంగా బాధితకుటుంబసభ్యులకు ఆందజేయనున్నారు.
అలాగే విజయవాడలో ఆసుపత్రికి వెళ్ళి సుబ్బారావు తనయుడిని, కుటుంబ సభ్యులను పరమర్శించారు. మంచి నాయకుణ్ని కోల్పోయామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.