Mon. Dec 23rd, 2024
AP_DYCM

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,డిసెంబర్ 20,2022: రేపు చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు.

చుండూరు మండలం యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరగనున్న సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల ను సోమవారం మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్ లతో కలిసి పరిశీలించారు.

విద్యార్థులకు శాంసంగ్ టాబ్ లు..

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రేపు జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచే శాంసంగ్ టాబ్ లు బైజూస్ సాప్ట్ వేర్ తో పంపిణీ ప్రారంభించనున్నారు.

ఈ నెల 21వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకుప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదన్నారు.

AP_DYCM

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కార్యక్రమానికి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆయన సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా యడ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ ను వీ.వీ.ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికను మంత్రులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి.పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఆదనపు ఎస్. పి మహేష్,రేపల్లె ఆర్.డి.ఓ పార్థసారథి, చీరాల ఆర్.డీ.ఓ సరోజిని, బాపట్ల ఆర్.డి.ఓ రవీంద్ర, పౌర సరఫరాల శాఖ డి.ఎస్. ఓ విలీమ్స్, డి.ఎం శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!