Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్, అక్టోబర్ 5, 2024: ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాదకర పరిణామంపై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

“గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు ఆమెను తన సన్నిధిలో చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “రాజేంద్ర ప్రసాద్ , వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. పుత్రిక వియోగం అనేది అత్యంత దుఃఖకరమైన విషయం.

ఈ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని, సహనాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను,” అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గాయత్రి అకస్మాత్తుగా మరణించడం సినీ ప్రముఖులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది.

error: Content is protected !!