Wed. Dec 25th, 2024
train_accident

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 15,2023: గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. తృటిలో ప్రమాదం తప్పింది. బీబీనగర్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

ప్రాణనష్టం జరగలేదు, సికింద్రాబాద్ వెళ్తున్న రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనకు గల కారణాలపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.

train_accident

తెలంగాణ రాష్ట్రంలోని బీబీనగర్‌లో బుధవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు కోచ్‌లు ఉదయం పట్టాలు తప్పినట్లు సమాచారం.

అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.

error: Content is protected !!