Fri. Nov 8th, 2024
hyderabad-air-quality

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 29,2022: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదికల ప్రకారం హైదరాబాద్‌లో గాలి నాణ్యత తగ్గింది. PM 2.5, PM 10 లలో పెరుగుతోంది. ఈ డేటా ప్రకారం హైదరాబాద్‌లో PM 2.5 స్థాయి దీపావళి రోజున క్యూబిక్ మీటరుకు 34 నుంచి 105 మైక్రోగ్రాములకు పొల్యూషన్ పెరిగింది. వాతావరణంలో PM 10 పరిమాణం ఒక క్యూబిక్ మీటరుకు 78 నుంచి 138 మైక్రోగ్రాములకు పెరిగింది.

ఈ సంవత్సరంతో పోల్చితే మహమ్మారి కారణంగా ఆగిన దివాలీ వేడుకల కారణంగా గత సంవత్సరం గాలి నాణ్యత స్థాయి గణనీయంగా తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది గాలి నాణ్యత ప్రీ-పాండమిక్ స్థాయికి చేరుకుంది. సల్ఫర్ డయాక్సైడ్ సాంద్రతలు 2021లో క్యూబిక్ మీటరుకు 5.8 మైక్రోగ్రాముల నుండి 2022లో క్యూబిక్ మీటరుకు 13.1 మైక్రోగ్రాములకు పెరిగాయి. అయినప్పటికీ, నైట్రోజన్ ఆక్సైడ్‌ల స్థాయి తగ్గింది.

hyderabad-air-quality

హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 115ను తాకింది. అత్యధిక AQI సోమాజిగూడలో (165) ఉండగా. జూ పార్క్‌లో రెండవ అత్యల్ప సూచిక (162) ఉంది. నగరంలో ప్రధాన వాయు కాలుష్య కారకాలు PM2.5, PM10, SO2, CO, ఓజోన్ , NO2, తదనుగుణంగా 44, 76, 2, 1159, 6, 12 స్థాయిలు ఉన్నాయి. నగర కాలుష్య స్థాయి WHO సిఫార్సు పరిమితి కంటే 2.9 రెట్లు ఎక్కువగా ఉంది.

error: Content is protected !!