365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 6, 2025: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ, సూర్య వశిష్ఠ, శివ కందుకూరి హీరోలుగా, ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ జియో సినిమా (జియో హాట్‌స్టార్ కాదు, జియో సినిమా అనే ఉంటుంది) లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ కూల్ అండ్ సింపుల్ వెబ్ సిరీస్ ఎలా ఉందో మన రివ్యూ లో చూద్దాం.
నటీనటులు: రీతు వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, ఇతరులు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు: బి. కిషోర్
రైటింగ్ అండ్ క్రియేట్: దీపక్ రాజ్
ప్రొడక్షన్ హౌస్: జాయ్ ఫిల్మ్స్
నిర్మాత: సుధాకర్ చాగంటి
కో ప్రొడ్యూసర్: సురేష్ ఎర్ర
క్రియేటివ్ ప్రొడ్యూసర్: నాగ నందిని
ప్రొడక్షన్ డిజైనర్: రామాంజనేయులు
సంగీత దర్శకుడు: జై క్రిష్
సినిమాటోగ్రాఫర్: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: కార్తికేయ రోహిణి
సౌండ్ డిజైన్: ఎతిరాజ్
లిరిక్స్: డి.ఆర్. రామ్
కలరిస్ట్: వి. రామ్ మూర్తి నేత, లావణ్య రెడ్డి తేటల
కథ:
పల్లెటూరి టీచర్‌గా పని చేసే దేవిక (రీతూ వర్మ) కు జగ్గూ (సుబ్బరాజు) తో ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. అయితే, ఓ పూజారి దేవిక ప్రేమలో పడుతుందని, జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు. కొద్ది రోజులకే డానీ అనే అబ్బాయి (సూర్య వశిష్ఠ) దేవికకు పరిచయం అవుతాడు.

అతని వ్యక్తిత్వం దేవికకు బాగా నచ్చుతుంది. ఆ కొద్ది రోజులకే శివ కందుకూరి కూడా దేవిక జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఈ ఇద్దరిలో దేవిక ఎవరితో ప్రేమలో పడుతుంది? సుబ్బరాజుతో ఎంగేజ్‌మెంట్ ఏమవుతుంది? అసలు ఆ దోషం ఏమిటి? చివరికి ఏమి జరుగుతుంది? అనేది సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్..
సిరీస్ పల్లెటూరి నేపథ్యంలో ఆహ్లాదకరంగా మొదలవుతుంది. రీతూ వర్మ ఓటీటీ డెబ్యూ ఇది. పల్లెటూరి అమ్మాయిగా, టీచర్‌గా ఆమె పాత్రకు చక్కగా ఒదిగిపోయింది. చూడముచ్చటగా ఉంది. సమస్యలు ఎదురైనప్పుడు ఎదుర్కొనే అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది.
సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయిగా చక్కగా సరిపోయాడు. సుబ్బరాజు పల్లెటూరి క్యారెక్టర్‌లో కొత్తగా కనిపించాడు. చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిపించడం విశేషం. సిరీస్ మొత్తానికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అద్దారు.
రీతూ వర్మ, సూర్య వశిష్ఠ మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్‌గా, బాగున్నాయి. సుబ్బరాజు లైట్ కామెడీ, శివ కందుకూరి అమాయకత్వం పండాయి. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగిన సిరీస్ ఇది. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. “అప్పుడే అయిపోయిందా?” అనే ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక వర్గం..
నిర్మాణ విలువలు చాలా సాలిడ్‌గా ఉన్నాయి. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఎక్కడా రాజీ పడకుండా ఈ సిరీస్‌ను నిర్మించారు. వెంకట్ సి దిలీప్ కెమెరా విజువల్స్ బాగున్నాయి.
అలాగే జై క్రిష్ సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. కార్తికేయన్ ఎడిటింగ్ చక్కగా ఉంది. పాటలు కూడా బాగున్నాయి. రీతూ వర్మ కాస్ట్యూమ్స్, పల్లెటూరి సెటప్ సిరీస్‌కు ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ను తీసుకొచ్చాయి.
Read This also…TransUnion CIBIL and Sa-Dhan Collaborate to Launch Nationwide Credit Awareness Program..
Read This also…NSE Sustainability Ratings and Analytics Ltd Launches ESG Ratings for Listed Companies..
ఇక దర్శకుడు బి కిషోర్ విషయానికి వస్తే, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుండి మొదలై, ‘శ్రీకారం’ సినిమాతో దర్శకుడిగా మారి ఇప్పుడు ఒక కూల్ లైన్‌తో ఓటీటీకి వచ్చారు.
తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను క్లియర్‌గా, సాఫీగా, కుటుంబం మొత్తం చూసే విధంగా తెరకెక్కించాడు. లవ్ సీన్స్, చివరిలో ఎమోషనల్ సీన్స్ బాగా చూపించాడు. ఆ అట్మాస్పియర్‌లోకి ప్రేక్షకులను తీసుకువెళ్లాడు.
మొత్తంగా చూసినట్లయితే, ఈ ‘దేవిక & డానీ’ సిరీస్ ఒక క్లీన్ అండ్ సింపుల్‌గా సాగే డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు బాగా చేశారు. ఒక డీసెంట్ సిరీస్‌ను, అది కూడా ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునే వారు జియో సినిమాలో ఈ సిరీస్‌ను చూడొచ్చు.
365తెలుగు డాట్ కామ్ రేటింగ్: 3/5..