365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 27,2025: ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
మారి సెల్వరాజ్ సినిమాలతో పోలిక: శివాజీ
ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “దండోరా వంటి సినిమాలు దశాబ్దానికి ఒకటి మాత్రమే వస్తాయని దర్శకుడు నీలకంఠ మెచ్చుకున్నారు. ఈ చిత్రం గురించి 2026 సంవత్సరం మొత్తం ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ఉత్తర అమెరికాలో షోల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. దర్శకుడు మురళీకాంత్ మేకింగ్‌ను చూసి మలయాళ దర్శకులతో, తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్‌తో పోలుస్తుంటే చాలా గర్వంగా ఉంది,” అని అన్నారు.

తమ పాత్ర కోసం పడిన కష్టాన్ని వివరిస్తూ.. “సినిమా షూటింగ్ సమయంలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. నా పాత్రలోని లుక్ సహజంగా ఉండాలని దర్శకుడు అడగకపోయినా కష్టపడ్డాను,” అని శివాజీ పేర్కొన్నారు.
మంచి కంటెంట్‌కు ఆదరణ: నవదీప్
నటుడు నవదీప్ మాట్లాడుతూ, సినిమాపై తమకున్న నమ్మకం రెట్టింపు అయిందని తెలిపారు. “పెద్ద సినిమాలు, కమర్షియల్ చిత్రాలకు టాక్ వస్తే ఒకసారి చూస్తారు. కానీ కంటెంట్ ఉన్న చిత్రాలకు మౌత్ టాక్ చాలా ముఖ్యం. దండోరా విషయంలో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. రోజురోజుకీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది,” అని హర్షం వ్యక్తం చేశారు.
Read this also“Dhandoraa” Success Meet: Sivaji Hails it as a Masterpiece; Comparisons to Mari Selvaraj Arise.
Read this also: Bondada Engineering Secures Rs.392 Crore Solar EPC Contract from NTPC Green Energy..
ఇది కూడా చదవండి : Plant Serum: జుట్టు కుదుళ్లకు ‘జీవం’.. ప్రకృతితోనే సాధ్యం..!
Read this also: Zee Telugu Announces Star-Studded “Bhoomi Gaganla New Year Party” for December 28…
సెన్సార్ ఆలస్యంపై నిర్మాత వివరణ
సినిమా రిలీజ్ ప్లానింగ్‌లో జరిగిన జాప్యంపై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని స్పందించారు. సెన్సార్ బోర్డు సూచించిన మార్పుల వల్ల క్లియరెన్స్ రావడంలో ఆలస్యమైందని, దానివల్ల షోల పంపిణీపై కొంత ప్రభావం పడిందని వివరించారు. అయినప్పటికీ, సినిమా కంటెంట్ బలంగా ఉండటంతో థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు మురళీకాంత్ భావోద్వేగం
ఐటీ రంగాన్ని వదిలి సినిమాపై ఇష్టంతో వచ్చానని దర్శకుడు మురళీకాంత్ తెలిపారు. “మూడున్నరేళ్ల నా కష్టం ఈ రోజు థియేటర్లలో ప్రేక్షకులు ఇస్తున్న స్టాండింగ్ ఓవేషన్‌తో మర్చిపోయాను. కుల వ్యవస్థలోని అంతర్గత కోణాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను,” అని భావోద్వేగానికి గురయ్యారు.
చాలా కాలం తర్వాత తెలుగులో బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొని సినిమాకు వస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
