365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్ 3, 2022: ఓడలు బళ్ళు..బళ్ళు ఓడల వుతుంటాయి. ఇదే ఓ బాలీవుడ్ స్టార్ జీవితంలో జరిగింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఈరోజు కొందరికి అనుకూలంగా ఉన్న కాలం ఇంకో రోజు మరికొందరికి ప్రతికూలంగా ఉండొచ్చు. బాలీవుడ్ పరిశ్రమను ఏలిన చక్రవర్తి ఆయన.. ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉందని తెలిస్తే చాలు సినిమా బాలీవుడ్ పరిశ్రమ కదిలివస్తుంది.
అలాంటి వ్యక్తి వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. ఆసమయంలో ఆ స్టార్ హీరోకు సాయం అందించడానికి భారతీయ వ్యాపార దిగ్గజమే ముందుకువచ్చారు. ఇంతకీ సినిమా పరిశ్రమను ఏలిన గొప్ప నటుడు భారీ అప్పుల్లో ఎందుకు మునిగిపోయారు..? ఆయనకు హెల్ప్ చేద్దామనుకున్న బిగ్ బిజినెస్ మ్యాన్ ఎవరు..? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
అప్పుల్లో కూరుకుపోయింది ఎవరోకాదు.. బాలీవుడ్ చక్రవర్తి.. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. అవును1999లో అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. ఈ సంస్థ ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌సేవలు అందించేది. కొన్నాళ్ళకుఅమితాబ్ కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దాదాపు రూ.90 కోట్లకు పైగా రుణాల రూపంలో తీసుకున్నారు అమితాబ్.. ఆ డబ్బు అప్పుగా ఇచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చి ఆయన ఇంటిమీదకు పడి నోటికొచ్చినట్లు తిట్టిపోశారు.
ఒక స్టార్ హీరో అని కూడా చూడలేదు..చెవులు వినలేని బూతులతో ఎంతో ఘోరంగా అప్పులిచ్చిన వాళ్ళు తిట్టి పోశారు. అదేసమయంలో ఈ విషయం ప్రముఖ వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీకి తెలిసింది. దీంతో వెంటనే అమితాబ్ బచ్చన్ కు డబ్బు సాయం చేశారు. ఇదేవిషయాన్ని గురించి అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో అందరితో పంచుకున్నారు.
తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న ధీరూభాయ్ అనిల్ అంబానీకి డబ్బులు ఇచ్చి అమితాబ్ బచ్చన్ కు అందించారట. ధీరూభాయ్ అంబానీ దాతృత్వానికి నేను ఉద్వేగానికి గురయ్యాను. కానీ.. అతని నుంచి సాయం తీసుకోకూడదనుకున్నా.. ఆపరిస్థితులు మాత్రం నన్ను తీసుకునేలాచే శాయి.అప్పుడు నా అప్పులన్నీ తీర్చాను అని అంటూ అమితాబ్ తెలిపారు.
అమితాబ్ బచ్చన్ 2000 సంవత్సరంలో మొహబ్బతే, కౌన్ బనేగా కరోడ్‌పతితో టెలివిజన్‌లో షో ద్వారా మళ్ళీ తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ పాపులారిటీ గతంలో కంటే మరింత పెరిగింది. అంతేకాదు అదేసమయంలో అమితాబ్ బచ్చన్ కభీ ఖుషీ కభీ ఘమ్, ఆంఖేన్, బాగ్‌బాన్, ఖాకీ, దేవ్, లక్ష్య, వీర్-జారా, బంటీ ఔర్ బబ్లీ, చీనీ కమ్, భూత్ నాథ్, సర్కార్, పా, పికు, పింక్, గులాబో వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు.
కొన్నాళ్ల తర్వాత ధీరూభాయ్ అంబానీ ఒక రోజు అమితాబ్ ను తన ఇంటికి పార్టీకి పిలిశారు. ఆ టైంలో తన మిత్రులకు అమితాబ్ పడ్డ కష్టాలను గురించి చెప్పారని, అంతేకాదు డబ్బు కంటే విలువైన మాటలతో తనకు ఓదార్పునిచ్చి ధీరూభాయ్ ఎంతగానో హెల్ప్ చేశారని తనకు ఎంతో ఆప్త మిత్రుడని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు.