365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 29,2024: సరికొత్త, ప్రత్యేకమైన కండోమ్ యాప్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ యాప్‌ను జర్మనీకి చెందిన లైంగిక సంరక్షణ బ్రాండ్ బిల్లీ బాయ్ పరిచయం చేసింది.
దీనిని డిజిటల్ కండోమ్ యాప్ లేదా కామ్‌డమ్ అని పిలుస్తున్నారు. వ్యక్తులకు అంబంధించి పడకగదిలోని ఆనంద క్షణాల గోప్యతను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
గోప్యతా ఆందోళనలు: బిల్లీ బాయ్ సంస్థ ఈ కొత్త ఆవిష్కరణ ప్రజలను అనుకోకుండా జరిగే మోసాల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ కెమెరా, మైక్రోఫోన్‌ను నిలిపివేస్తుంది. తద్వారా అనుమతి లేకుండా వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేయలేరు.

ప్రారంభించినప్పటి నుంచి, ఈ డిజిటల్ కండోమ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. కొంతమంది దీనిని ప్రశంసిస్తున్నారు, కొందరు దీనిని పనికిరాని ఆవిష్కరణగా భావిస్తున్నారు.
డేటా భద్రతకు ఇది ఎందుకు ముఖ్యం..?
ఈ రోజుల్లో మన ఫోన్‌లలో మన వ్యక్తిగత డేటా చాలా వరకు ఉందని కంపెనీ తెలిపింది. అటువంటి పరిస్థితిలో, మన వ్యక్తిగత సంభాషణలను అనుమతి లేకుండా రికార్డ్ చేయకుండా రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆలోచనతో ఈ యాప్ అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం, ప్రజల గోప్యతను రక్షించడంలో ఇది సహాయపడు తుందని బిల్లీ బాయ్ సంస్థ వెల్లడించింది.
యాప్‌ను ఎలా ఉపయోగించాలి..?
ఈ యాప్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు ముందుగా దీన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు వారు వర్చువల్ బటన్‌ను స్వైప్ చేయాలి. ఇలా చేయడం ద్వారా, ఫోన్ మైక్రోఫోన్ , కెమెరా ఆఫ్ అవుతాయి. ఈ ప్రక్రియ చాలా ఈజీ , ఎవరైనా సులభంగా చేయవచ్చు.
అలారం సిస్టమ్ ప్రత్యేక ఫీచర్..?

మీ భాగస్వామి కెమెరాను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే, ఈ యాప్ వెంటనే హెచ్చరికను పంపుతుంది. అలారం మోగుతుంది. ఇది మీ గోప్యతను ఉల్లంఘించే ప్రయత్నం జరుగుతోందని మీకు వెంటనే తెలియజేస్తుంది. ఈ యాప్ డిజిటల్‌గా మీ గోప్యతను రక్షిస్తుంది. మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
గ్లోబల్ రీచ్: ఈ యాప్ 30కి పైగా దేశాల్లో వినియోగిస్తున్నట్లు బిల్లీ బాయ్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం, ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇది రాబోయే రోజుల్లో ఐఓఎస్ పరికరాల్లో కూడా ప్రారంభించనున్నారు. ఈ కొత్త డిజిటల్ కండోమ్ యాప్ కాన్సెప్ట్ గోప్యతను కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన అడుగు.
ఇది వ్యక్తిగత భద్రతను మాత్రమే కాకుండా వారి సన్నిహిత క్షణాలపై ప్రజలకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో, భవిష్యత్తులో ఈ యాప్ వినియోగం ఎలా పెరుగుతుందో.? ప్రజల గోప్యతను ఎంతవరకు రక్షించగలదో..? చూడాలి..