Mon. Dec 23rd, 2024
fashion show

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 29,2023: బాలీవుడ్ నటి దిశా పటానీ ఫ్యాషన్ షో లో హొయలుపోయింది. సరికొత్తసీజ్యువెలరీ కలెక్షన్ తో మెరిసింది. హైదరాబాద్‌లోని అగ్ర శ్రేణి వారసత్వ ఆభరణాల సంస్థ ,శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎనిమిది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది.

fashion show
fashion show

ఈసందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. శివ నారాయణ్ జ్యువెలర్స్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించిన మొదటి భారతీయ ఆభరణాల వ్యాపార సంస్థగా అవతరించింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని,సెలబ్రటి లు హాజరు కాగా ఒక భారీ వేడుకను హైదరాబాద్‌లో చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే, శివనారాయణ మహోన్నత వారసత్వాన్ని ప్రశంసించడానికి సరైన వేదికగా ప్రతిబింబించే తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించారు.

fashion show
fashion show

ఈ భారీ వేడుకలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ దిశా పటానీ, శివ నారాయణ్ అత్యున్నత ఆభరణాలను ధరించి ర్యాంప్‌పై ప్రదర్శించారు. దివి నుంచి భువి కి వచ్చిన దేవకన్యలా ఆమె ర్యాంప్ పై నడిచి వస్తుంటే, ఆభరణాల సంక్లిష్టత మాత్రమే కాకుండా హస్తకళ నైపుణ్యం, వాటి గాంభీర్యత సైతం అంతే గొప్పగా ప్రదర్శితమయ్యాయి.

ఫ్యాషన్ షోలో భాగంగా ఈ ఆభరణాలను ధరించిన పలువురు మోడల్స్ తమ క్యాట్ వాక్ తో ఆకట్టుకున్నారు. అయితే కార్యక్రమంలో మరో ఆకర్షనీయమైన అంశంగా అపూర్వమైన ‘ఎక్స్‌పీరియన్షియల్ జోన్’ నిలిచింది.

రికార్డ్-బ్రేకింగ్ ఆభరణాల లీనమయ్యే అనుభవాలను ఇది అందించింది. ప్రతి క్రియేషన్ కూ తగినట్లు గా అంకితమైన నాలుగు జోన్‌లు, ఆభరణాల ప్రేరణలు, ఆవిష్కరణలు,సూక్ష్మ నైపుణ్యాలను ప్రదర్శించాయి.

fashion show
fashion show

ఈ నాలుగింటిలో మొదటిది, గణేష్ లాకెట్టు, 1011.150 గ్రాముల బరువున్న అత్యంత బరువైన లాకెట్టు & లాకెట్టుపై ఉంచిన అత్యధిక సంఖ్యలోని వజ్రాలు (11,472) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించింది. సున్నితమైన పనితనానికి నిదర్శనం గా చేతితో తయారు చేసిన ఈ ఆభరణాన్ని రూపొందించడానికి ఆరున్నర నెలలు సమయం పట్టింది.

శివ నారాయణ్ జ్యువెలర్స్ తమ సొంత రికార్డును బద్దలు కొట్టారు: రామ్ దర్బార్ 1681.820 గ్రాముల భారీ లాకెట్టు , 54,666 వజ్రాలతో ఒక పెండెంట్‌పై ఉంచిన అత్యదిక వజ్రాల కోసం ప్రపంచ రికార్డును సాధించింది. ఈ హెవీయెస్ట్ డైమండ్ ను ఎనిమిదిన్నర నెలల పాటు కష్టపడి రూపొందించారు. ఈ లాకెట్టు వెనుక భాగంలో కూడా శ్రీరామ్ అని రాసి ఉన్న వజ్రాలతో రూపొందించారు.

సత్లాద నెక్లెస్ (ది సెవెన్ లేయర్ నెక్లెస్) శివ నారాయణ్ మూడవ అవార్డ్ విన్నింగ్ మాస్టర్ పీస్. 315 పచ్చలు 1971 ఫైన్ డైమండ్స్ తో రూపొందించారు. ఇది ఇప్పుడు నెక్లెస్‌పై అత్యధిక పచ్చలు, నెక్లెస్‌పై అత్యధిక వజ్రాలున్న రికార్డులను కలిగి ఉంది.

fashion show
fashion show

ఈ నెక్లెస్ కోసం మాత్రమే రత్నాల ను ఎంపిక చేయటానికి రెండున్నరేళ్ళు పట్టింది. ఈ ఆభరణం తయారు చేయటానికి ఐదున్నర నెలల సమయం పట్టింది.

శివనారాయణ వారసత్వంలో అంతర్భాగమైన నిజాంల పురాతన సంపదకు నివాళులు అర్పిస్తూ, ప్రతి ఆభరణంలో కనిపించే శివ నారాయణ్ అంకితభావం శ్రద్ధకు ప్రతీకగా సత్లాద నెక్లెస్ అద్భుతమైన సృష్టి నిలుస్తుంది.

లగ్జరీని నూతన శిఖరాలకు తీసుకుని వెళ్తూ , శివ నారాయణ్ జ్యువెలర్స్ మాగ్నిఫైయింగ్ గ్లాస్ $108,346 ఆకట్టుకునే విలువను కలిగి ఉంది, ఇది అత్యంత ఖరీదైన భూతద్దంగానూ నిలిచింది.

ఈ సందర్భంగా శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ మాట్లాడుతూ “మేము 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించడం పట్ల నిజంగా గర్వంగా ఉంది. ఇది మొత్తం పరిశ్రమకు గొప్ప పురోగతిగానూ నిలుస్తుంది.

fashion show
fashion show

“మా అంకితభావం, కృషి, అభిరుచి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కినందుకు మేము కృతజ్ఞులమై ఉంటాము. పరిశ్రమలో నూతన ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహించడంతో పాటుగా నూతన శిఖరాలకు చేరుకోవాలని మేము ఆశిస్తున్నాము.” అని అన్నారు.

ఎనిమిది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన ఏకైక భారతీయ ఆభరణాల వ్యాపారిగా, శివ నారాయణ్ జువెలర్స్ రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో అగ్రస్థానంలో తమ స్థానాన్ని పదిలపరుచుకుంది. శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక వింటేజ్,రాయల్ జ్యువెలరీ బ్రాండ్ గా ఎమరల్డ్ ఆభరణాలలో ప్రత్యేకత కలిగి ఉంది.

హైదరాబాద్‌లోని VII నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ప్రధాన ఆభరణాల వ్యాపారి సేథ్ శివ నారాయణ్ జీ ఈ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి, బ్రాండ్ అనేక కళాఖండాలను సృష్టించింది. ఈరోజు, ఇది కంపెనీ ప్రస్తుత ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన కమల్ కిషోర్ అగర్వాల్ తుషార్ అగర్వాల్ చేతుల్లో ఉంది. మరింత సమాచారం కోసం https://shivnarayanjewellers.com/ సందర్శించండి-

fashion show
fashion show
error: Content is protected !!